బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే బయటకు..
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లా లాల్గౌన్ పాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్సీ అనే చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసి చెకప్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
बेटी की मां से फोन पर बात की है। यह जानकर संतोष और आनंद हुआ कि बेटी स्वस्थ है।
उसे जनरल चेकअप के लिए अस्पताल ले जाया गया।
मेरी शुभकामनाएं और आशीर्वाद बेटी के साथ हैं। मामा शिवराज सदैव तुम्हारे साथ हैं! https://t.co/KK9GdA7Qfz
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 26, 2023
కాగా నాన్సీ బోరుబావిలో సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు. వివిధ రకాల పరికరాలు, జేసీబీలు ఉపయోగించి పాపను కాపాడినట్లు వివరించారు.
గతేడాది జూన్లో కూడా ఈ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐదేళ్ల బాలుడు పొలంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. సహాయక సిబ్బంది 8 గంటలు శ్రమించి అతడ్ని సురిక్షితంగా కాపాడారు.
చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం