shoe lace
-
పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి
బ్రెజిల్‌కి మూడు ఫిఫా వరల్డ్ కప్స్ (1958, 1962, 1970) అందించిన పీలే... బ్రాండ్స్‌కి మార్కెటింగ్ చేయడంలోనూ తన మార్కు చూపించారు. రెండు ప్రపంచ కప్స్ గెలిచిన తర్వాత పీలే ఫిఫా వరల్డ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొంతున్న సమయంలో ఆయనతో బ్రాండ్ ప్రమోషన్ చేయించాలని కంపెనీలన్నీ క్యూ కట్టాయి. 1970లో స్పోర్ట్స్ షూస్ కంపెనీ పూమా, పీలేతో బ్రాండ్ ప్రమోషన్‌కి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సాధారణంగా ప్రమోట్ చేస్తే కుదురదని బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ వినూత్న ప్లాన్‌ను వాడింది పూమా. 1970 వరల్డ్ కప్ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పూమా, తన షూ లేస్‌ని కట్టుకోవడం మొదలెట్టాడు.. అంతే కంపెనీకి కోట్ల రూపాయాల్లో టర్నోవర్ వచ్చింది. కేవలం మ్యాచ్ ఆరంభానికి ముందు షూ లేస్ కట్టుకున్నందుకు 120000 డాలర్లు (దాదాపు కోటి రూపాయల వరకూ) పీలేకి ముట్టచెప్పింది పూమా కంపెనీ. మ్యాచ్ సమయంలో పీలే షూ లేస్ కట్టుకోవడం వల్ల పూమా కంపెనీకి కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అప్పట్లో పీలేకి ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే... తన సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? -
‘చాహల్ నిజంగా జెంటిల్మన్’
సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో అద్బుతమైన ఆటతీరుతోనే కాదు.. మంచి మనసుతోనూ అభిమానుల హృదయాలు గెలుచుకోవచ్చని నిరూపించాడు టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్, కేదార్ జాదవ్‌లో పోటీ పడి వికెట్లు తీయలేకపోయిన ఒక సూపర్బ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో చాహల్ చూపిన క్రీడా స్పూర్తికి యావత్ క్రీడా అభిమానులు, నెటజన్లు ఫిదా అయ్యారు. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 42.4 ఓవర్ బౌలింగ్ చేస్తున్న చాహల్ పాక్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాన్ షూ లేస్ కట్టి అతడికి సహాయం చేశాడు. ప్రస్తుతం చాహల్ పాక్ బ్యాట్స్‌మన్‌కు షూలేస్ కట్టిన ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు చహల్‌ను అభినందిస్తున్నారు. క్రీడా స్పూర్తిని చాటిన మణికట్టు మాంత్రికుడు నిజంగా జెంటిల్మన్, హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న ఆటలో ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచిపోకుండా ఆటలకు ఉన్న గౌరవాన్ని కాపాడారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో చాంపియన్ ట్రోఫీలో పాక్‌పై టీమిండియాకు ఎదురైన పరాభవానికి ఈ విజయం కాస్త ఉపశమనం కలిగించింది. -
కుర్రాళ్లూ.. శభాష్!
క్రైస్ట్‌చర్చ్: అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. మైదానంలో ఇరు దేశాల యువ ఆటగాళ్లు పరస్పరం సహకరించుకున్న తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది. భారత బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీకి చేరువైన సమయంలో అతడి షూ లేసు ఊడిపోవడంతో పాకిస్తాన్ ఫీల్డర్ కట్టాడు. అలాగే తమ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ షూ లేసు ఊడిపోయినప్పుడు భారత ఫీల్డర్ సహాయం చేశాడు. సెంచరీ పూర్తి చేసిన శుభ్‌మాన్ గిల్ దగ్గరకు వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లలో చాలా మంది అతడిని అభినందించారు. కీలక మ్యాచ్‌లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరు జట్ల ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ వేసి ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ ఫలితం ఎలావున్న యువ ఆటగాళ్లు తమ ప్రవర్తనతో మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. భారత్-పాక్ క్రికెటర్లు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన యువ టీమిండియాపై సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. శుభ్‌మాన్ గిల్‌ను అభినందిస్తున్న పాకిస్తాన్ ఆటగాళ్లు -
మంత్రిగారికి పోలీసు పాదసేవ!
పోలీసులను మంత్రులు తమ సేవకులుగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వైనం ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంది. ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఒకరు.. తన బూటు లేసులను ఓ పోలీసు కానిస్టేబుల్‌తో కట్టించుకున్న వ్యవహారం బట్టబయలైంది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్న రచ్‌పాల్ సింగ్ తన వ్యక్తిగత భద్రతకు నియమించిన గార్డుతో బూటు లేసులు కట్టించుకుంటూ కెమెరాకు దొరికేశారు. ముందుగా ఓ విగ్రహానికి దండ వేసేందుకు బూట్లు విప్పిన మంత్రి.. ఆ తర్వాత వాటిని కట్టుకోడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే గార్డు ఆయన వద్దకు వచ్చారు. మంత్రి ఆయనను ఏమాత్రం ఆపకపోగా.. ఎంచక్కా తన కాళ్లిచ్చి, లేసులు కట్టించుకున్నారు. రచ్‌పాల్ సింగ్ గతంలో ఐపీఎస్ అధికారిగా కూడా పనిచేశారు. ఈ అంశం వెలుగులోకి రావడంతో విపక్షాలు ఒక్కసారిగా మమత సర్కారుపై మండిపడ్డాయి.