' షూటింగ్ హబ్‌గా హైదరాబాద్'
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని షూటింగ్ హబ్‌గా మారుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ... హైదరాబాద్‌లో సినిమా షుటింగ్ చేసుకునే వారికి రాయితీ ఇచ్చేలా సీఎం కేసీఆర్‌తో చర్చించామని తెలిపారు.
ఫిల్మ్ సిటీ ఏర్పాట్లపై కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని వివరించారు. రంగారెడ్డి జిల్లా రాచకోండలోని సువిశాలమైన స్థలంలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ రాచకోండ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.