ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై దాడి - ఒకరి మృతి
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వర్ గ్రామ శివారులో ఇసుక తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున కొంత మంది వ్యక్తులు ఇసుక తరలిస్తుండగా.. వీరిపై ప్రత్యర్థులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాళ్లచెరుతాండాకు చెందిన శ్రీనునాయక్ జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈసంఘటనపై మిడ్జిల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.