కనుమరుగు రొయ్యో..!
కూటమి సర్కారు కుట్ర.. అందని ప్రోత్సాహకం.. పెరిగిన విద్యుత్ చార్జీలు.. నాసిరకం రొయ్య పిల్లల ఉత్పత్తి.. క్షీణించిన ఎగుమతులు.. దక్కని గిట్టుబాటు ధరలు.. వెరసి.. ఆక్వాకల్చర్ చతికిలపడింది. కొనేనాథులు లేక హేచరీలు మూతపడ్డాయి.. ఫలితంగా రొయ్యల చెరువులు వరి మడులుగా మారాయి. కుబేరులుగా మారిన ఆక్వా రైతులు ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. వాకాడు: నాడు రొయ్యల సాగు చేసిన రైతులు, హేచరీల యజమానులు కుబేరులుగా మారారు. అయితే నేడు రొయ్యల పరిశ్రమకు గడ్డు కాలం వచ్చింది. దీంతో తిరుపతి జిల్లాలో ఆక్వా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి కావడంతో విదేశీ మారక ద్రవ్యం బాగా పెరిగి ఎంతో మంది రైతులు కుబేరులుగా మారా రు. దీంతో ఆక్వాసాగు నలు మూలలకు విస్తరించింది.అనేక ప్రాంతాల్లో రైతులు, చిన్న చిన్న వ్యాపా రులు, ఉద్యోగులు సైతం లాభాలు గడించేందుకు తమ వృత్తులకు స్వస్తి పలికి ఆక్వా సాగులోకి ప్రవేశించారు. ఆక్వా సాగుకు అనుగుణంగా జిల్లా సముద్ర తీరం వెంబడి 24 రొయ్య పిల్లల కేంద్రాలు వెలిశాయి. అందులో వాకాడు మండలంలో 23, కోట మండలంలో ఒక హేచరీ ఉన్నాయి. ఎక్కువసార్లు పిల్లల ఉత్పత్తితో నాణ్యత క్షీణత రొయ్యి పిల్లలను ఉత్పత్తి చేసే బ్లోడర్స్ విషయంలో హేచరీల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక తల్లి రొయ్యి (బ్లోడర్)తో మూడు సార్లు మాత్రమే రొయ్యి పిల్లలు పెట్టించాలి. అలా జరిపితేనే సాగు సక్సెస్ అవుతుంది. అదే తరహాలోనే వైరస్ లేకుండా మంచి దిగుబడులు కూడా వస్తాయి. ఈ ప్రక్రియ ఏ ఒక్క హేచరీలో కూడా జరగడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని హేచరీలు తొలి కాన్పులో పెట్టించిన పిల్లలు, అలాగే 7, 8 కాన్పుల్లో పెట్టించిన పిల్లలను మిక్సింగ్ చేసి రైతులకు అంటగడుతున్నారు. ఇలా చేయడంతో అవి చెరువుల్లో ఎదుగుదల తగ్గిపోయి వివిధ సైజుల్లో పెరుగుతున్నాయి. ప్రతి హేచరీకి ఇతర దేశాల నుంచి నాణ్యమైన బ్లోడర్స్ వస్తాయని రైతులకు ఒక నమ్మకం ఉంది. కాని ఇతర దేశాల నుంచి ఒక తల్లి రొయ్యను (బ్లోడర్)ను తెప్పించి దాంతోపాటు లోకల్ బ్లోడర్స్ని కలిపి పిల్లలను ఉత్పత్తి చేసి రైతులను మోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ హేచరీలపై నమ్మకం లేని ఆక్వా రైతులు పాండిచ్చేరి, భీమవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి సీడ్ కొనుగోలు చేసేవారు.జిల్లాలోనే మొట్ట మొదటిసారి.. 1990–91లో తిరుపతి జిల్లా వాకాడు మండల తీర ప్రాంత గ్రామాలు అందలమాట, వాలమేడు ప్రాంతాల్లో రొయ్యిల సాగు ప్రారంభమైంది. అప్పటి నుంచి కనక వర్షం కురిపించిన ఆక్వా రంగం అందరినీ ఆకర్షించింది. అనేక ప్రాంతాల్లోని పలువురు రైతులు లాభాలు గడించేందుకు వరి పంటలను వదిలేసి ఆక్వా సాగులోకి ప్రవేశించారు. అప్పట్లో వరి సాగు విస్తార్ణం తగ్గిపోయి ఆక్వా సాగు పెరిగిపోయింది. వరుస నష్టాలతో రైతులు ఆక్వా సాగును వదిలేసి మళ్లీ వరిసాగులోకి వస్తున్నారు.ఆక్వా రైతుకు జగనన్నఅండగత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు అండగా నిలిచారు. రొయ్య సాగు చేసే రైతులకు పలు రాయితీ ఇచ్చి, వారిని ఆదుకున్నారు. దీంతో ఆగిపోయిన రొయ్య ఎగుమతులను కరోనాలో సైతం యూరోపియన్ దేశాలకు ఎగుమతి జరిగింది. అదే సమయంలో ఆక్వా రైతుల కష్టాలను గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో డాలర్ల సేద్యంగా మారిన టైగర్ రొయ్యల సాగుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా 6 హేచరీల ద్వారా టైగర్ రొయ్య పిల్లల ఉత్పత్తికి అనుమతి లభించగా అందులో ఒక ఏపీలోనే 5 హేచరీలకు అనుమతులను తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాకు 3 హేచరీలకు టైగర్ సీడ్ ఉత్పత్తికి అనుమతి లభించించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా 76 రొయ్య పిల్లల హేచరీలు ఉండగా అందులో 3 హేచరీల్లో మాత్రమే టైగర్ సీడ్తోపాటు, లార్వా రేరింగ్ ఉత్పత్తికి అనుమతి లభించింది. అయితే నేడు హేచరీల యజమానులు 30 పైసలకు రొయ్యిపిల్లను విక్రయిస్తున్నా కొనే వారు కరువయ్యారు.కొనేవారు లేక మూత పడిన 20 హేచరీలుతిరుపతి జిల్లాలో తీరం వెంబడి 17 రొయ్య పిల్లల ఉ త్పత్తి హేచరీలు ఉన్నాయి. అందులో 3 హేచరీలు మాత్రమే ప్రస్తుతం అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. జిల్లాలో 2022 వరకు 4 వేల హెక్టార్లలో ఆక్వా సాగు సాగేది. అయితే రాను రాను రొయ్యల సాగులో రైతులకు నష్టాలే మిగలడంతో ఒక్కొక్కరుగా సాగుకు దూరమయ్యారు.ప్రస్తుతం చిల్లకూరు, గూ డూరు, కోట, వాకాడు, చిట్టమూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో కేవలం 800 హెక్టార్లలో మాత్రమే సాగు ఉంది. దీంతో రొయ్య పిల్లలు కొనే వారు లేక హేచరీలు ఒక్కొక్కటి గా మూత పడ్డాయి. హేచరీల యజమానులకు వ్యాపారాలు లేక పెట్టిన పెట్టుబడులు రాక లబోదిబోమంటున్నారు. ఒక హేచరీ ని ర్మించాలంటే దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.11 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. అందులో దాదాపు 50 నుంచి 100 మంది వరకు వర్కర్లు ఉంటారు. ఒక్కొక్కరికి రూ.15 నుంచి రూ.40 వేలు వరకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కూటమి సర్కారు హేచరీలకు కరెంటు బిల్లులపై రాయితీ ఇస్తామని చెప్పి రూ.6.50కు పెంచి మోసం చేయడంతో మ రింత భారం పడింది. దీంతో ఏటా రూ.కో ట్లల్లో నష్టాలు రావడంతో హేచరీ నిర్వాహకులు నష్టాలు భరించలేక చేతులు ఎత్తేశారు. వేలాది మంది పనిలేక రోడ్డున పడ్డారు. నాణ్యమైన తల్లి రొయ్యతోనే అధిక దిగుబడి అధిక నాణ్యత కలిగిన రొయ్య పిల్లలను స్థిరంగా ఉత్పత్తి చేయడం, అలాగే రొయ్యల సాగు అవసరాలను తీర్చడానికి తీరంలో హేచరీలను ఏర్పాటు చేశారు. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం ఒకప్పుడు అమెరికా నుంచి అర్డిలైన్, పేనెట్ తదితర కంపెనీల నుంచి తల్లి రొయ్యలు రాష్టానికి వచ్చేవి. ఆయా కంపెనీలకు ముందుగా హేచరీల యజమాను లు ఒక్కో తల్లి రొయ్యకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు వరకు నగదు చెల్లించి ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ తరువాత బ్రోడర్స్(తల్లి రొయ్యలు) అమెరికా నుంచి ప్రభుత్వ మత్స్యశాఖ ల్యాబ్లకు వస్తాయి. అక్కడ పూర్తి స్థాయిలో తల్లిరొయ్యకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాతే బుకింగ్ చేసుకున్న ఆయా హేచరీలకు చేరుతాయి. హేచరీలకు చేరిన తరువాత మళ్లీ కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ(సీఏఏ) వారు పరిశీలన అనంతరం వారి అనుమతి మేరకు వాటి ద్వారా గుడ్లు పెట్టించడం జరుగుతుంది. జిల్లాలో అనుమతి లభించిన హేచరీలన్నీ వంద మిలియన్ల సీడ్ ఉత్పత్తి చేసే సామర్థం కలిగినవే. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులకు లోబడి మాత్రమే సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. తద్వారా ఉత్పత్తి చేసిన పిల్లలకు ఎలాంటి వ్యాధులు లేకుండా, మంచి పెరుగుదల వచ్చేటట్లు ముందుస్తు పరీక్షలు నిర్వహించి రైతులకు ఇవ్వాలి. ఇలా చేయడంతో రైతులు అనుకున్న దిగుబడుల కంటే అధనపు దిగుబడులు సాధించడం జరుగుతుంది. ఇలా చేయడంతో 1996–2012 మధ్య కాలంలో రొయ్యల దిగుబడులు అధికంగా రావడం, ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడి ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ మొత్తంలో రొయ్యిలు యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం వచ్చేది. ఆక్వా కల్చర్ తగ్గిన మాట వాస్తవమేజిల్లాలో 24 రొయ్య పిల్లల హేచరీలున్నాయి. అందులో మూడు మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. వివిధ కారణాలతో కల్చర్ తగ్గిన మాట వాస్తవమే. దీంతో హేచరీలు షట్డౌన్ అయ్యాయి. త్వరలోనే కల్చర్ పూర్తిస్థాయిలో ప్రారంభించి, గతంలో మాదిరి అన్ని హేచరీలు పనిచేస్తాయని అనుకుంటున్నాను. – నాగరాజు, జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ తిరుపతి