Shrimp seed
-
వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు
సాక్షి, విజయనగరం : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో చేతల ప్రభుత్వం ఉందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భోగాపురం మండలంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందుకోసం 25 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మత్స్య పరిశ్రమలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందంటూ, ఈ ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో సగటు రొయ్యల ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు కాగా, దీనిని 9 టన్నులకు పెంచాలని నిర్దేశించారు. రొయ్యలకు సర్టిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్య శాఖ కమిషనర్ రాం శంకర్ నాయక్ పాల్గొన్నారు. -
రొయ్యల సీడ్ ఎంపికే ప్రధానం
ఆక్వా అసిస్టెంట్ డెరైక్టర్ ఖాన్దాన్ కోడూరు : ఆక్వా సాగు చేసే రైతులు సీడ్‌ను ఎంచుకునే విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తేనే ఫలితం ఉంటుందని ఎంపెడా సంస్థ ఆక్వా అసిస్టెంట్ డెరైక్టర్ ఎస్.ఖాన్దాన్ అన్నారు. శుక్రవారం శ్రీదానాశక్తి ఆర్యవైశ్య ప్రార్థనామందిరంలో భారత వాణిజ్య, పరిశ్రమల మం త్రిత్వ శాఖలకు చెందిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టైగర్ రొయ్యల సాగు పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఖాన్దాన్ మాట్లాడుతూ ఆక్వా రంగంపై ప్రసుత్తం వెనామీ జాతికి చెందిన రొయ్యలపై రైతులు మక్కువ చూపుతున్నారని, కానీ టైగర్ రొయ్య సాగుచేయడం వల్ల మంచి లభాలతో పాటు ప్రజలకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రొయ్యల పెంపకంపై సెమినార్.. రొయ్యలను చెరువులో వేసిన దగ్గర నుంచి పట్టే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఎంపెడా యాంటిబయాటిక్స్ అసిస్టెంట్ డెరైక్టర్ వి.సుబ్బారావు సెమినార్ ద్వారా రైతులకు వివరించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎస్.వి.శర్మ ,కాకినాడకు చెందిన నాస్‌ఖా సీఈవో జి.రాజ్‌కుమార్, ఎంపెడా ఏఐ షణ్ముకరావు, ఆక్వా జేటీవో పి.శ్రీనివాసులు, ఆక్వా టైగర్ హెల్త్ అధికారి జి.రామార్ మాట్లాడారు. కోడూరు, నాగాయలంకకు చెందిన ఆక్వా రైతులు వంసతరావు సుధాకర్‌రావు, పేర్ల శేషగిరిరావు, సైకం భాస్కరరావు, తదితరులు ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రొయ్యల సాగు చేస్తున్న రైతులకు లెసైన్సులను ఉచి తంగా అందజేశారు. భావదేవరపల్లికి చెందిన మండలి వెంకటకృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు, రైతు సంఘం నాయకులు ఆవుల బసవయ్య పాల్గొన్నారు. టైగర్ రొయ్యతో లాభాల పంట తగిన జాగ్రత్తలతో సాగుచేస్తే ఆక్వా రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న టైగర్ రొయ్య రైతులకు లాభాల పంట తెచ్చిపెడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రోఫెసర్ ఎస్.వి.శర్మ అన్నారు. టైగర్ రొయ్య పెంపకంపై కోడూరులో రైతులకు ఏర్పాటు చేసిన సదస్సుకు హజరైన శర్మ పలు సూచనలు అందించారు. యాంటిబయాటిక్స్‌ని నిబద్ధత లేకుండా వాడటాన్ని తగ్గిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన రొయ్యలను అందించగలుగుతారని ఆయన తెలిపారు. రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.