త్వరలో కనవు నెడుంశాలై
ఆసక్తి కరమయిన కథ కథనాలతో తెరకెక్కిస్తున్న చిత్రం కనవు నెడుంశాలై అని దర్శకుడు టి.కృష్ణసామి తెలిపారు. ఎంజీకే మూవీ మేకర్, పతాకంపై ఎస్.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయరుద్ర, వంశీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. హీరోయిన్గా ముంబాయి బ్యూటీ ఖుషీ పరిచయం అవుతున్నారు. ముఖ్య పాత్రల్లో దర్శకుడు ఎం.కళంజియం నటించగా ఇతర పాత్రల్లో నటరాజ్ పాండియన్, సెంథిల్, రేణుక తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ శిష్యుడు శ్యామ్ బెజమిన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి యోగా భాస్కర్ ఛాయాగ్రహణం నెరిపారు.
చిత్రం గురించి దర్శకుడు తెలిపుతూ ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే శిలల అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. ఇందులో మూడు పాటలుంటాయని తెలిపారు. అందులో ఒక పాట ఫుట్బాల్ క్రీడను కీర్తించే విధంగా ఉంటుందన్నారు. ఈ పాట కోసం 150 మంది ఫుట్బాల్ క్రీడాకారులను నటింపచేసినట్లు చెప్పారు. త్వరలో అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నీ జరగనున్న నేథ్యంలో ఈ పాట ఫుట్బాల్ క్రీడ అభిమానుల్ని అలరించే విధంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.