ప్రకాశ్ రాజ్ పారితోషికం తీసుకోలేదు
ముంబై: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పారితోషికం తీసుకోకుండా ఉచితంగా ఓ సినిమాలో నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా సిలా సమయంగలిల్లో ప్రకాశ్ రాజ్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో నటించినందుకు ప్రకాశ్ డబ్బులు తీసుకోలేదని ప్రియదర్శన్ చెప్పారు.
ముంబై ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు ప్రియదర్శన్ వెళ్లారు. ముంబై ఫిలిం ఫెస్టివల్లో సిలా సమయంగలిల్ను ప్రదర్శించనున్నారు. ఇసరి గణేశ్, ప్రభు దేవా, ఏఎల్ విజయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్‌తో పాటు శ్రియా రెడ్డి, అశోక్ సెల్వన్ నటించారు. ఎయిడ్స్ గురించి ఈ సినిమా తీశారు.