Silk india silk
-
సిల్క్ ఇండియా ప్రదర్శన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన దుస్తులతో సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శన మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటైంది. వివాహ ప్రత్యేక దుస్తుల శ్రేణిని నేపథ్యంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. ప్రదర్శనలో ఉప్పాడ, బనారస్ సిల్క్స్, గద్వాల, ధర్మవరం తదితర ప్రసిద్ధి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చేనేత కళాకారులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు, డిజైనర్లు తదితరుల బృందంతో ఏర్పాటైన ఒడిస్సా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఈ నెల 9 వరకు కొనసాగుతుందని వివరించారు. -
వస్త్ర ప్రియులకోసం.. సిల్క్ షో
పట్టు మెరుపు కుప్పలు పోసినట్టు... సిల్క్ సోయగాలు రాశులై వెలసినట్టు వస్త్ర ప్రియులను మైమరిపిస్తోంది సిల్క్ ఇండియా సిల్క్ వస్త్ర ప్రదర్శన. ఆగ్రాకు చెందిన కృష్ణా ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థాన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఖాజా మాన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ వస్త్ర ప్రదర్శన 100కు పైగా చేనేత కళాకారుల పనితనానికి పట్టం కట్టింది. డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సూట్స్, కుర్తా, స్టోల్స్, దుపట్టా వంటి వెరైటీలతో పాటు జ్యువెలరీ, యాక్సెసరీస్ ఇక్కడి స్టాల్స్‌లో ఆకట్టుకొంటున్నాయి. ఈ నెల 6 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలోని ఉత్పత్తులను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, గాయకులు గీతామాధురి, పార్థసారథి ఆసక్తిగా తిలకించారు. - సాక్షి, సిటీ ప్లస్