simhavahanam
-
సింహవాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహామంగళ హారతి, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనారసింహుడు సింహ వాహనంపై కొలువుదీర్చారు. విశేష పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పల్లకీలో స్వామి వారిని ఊరేగించారు. అలాగే నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి మూల విరాట్‌కు విశేష పుష్పాలతో అలంకరించారు. ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఈఓ రమేష్‌బాబు అధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. -
సింహవాహనంపై దర్శనమిచ్చిన రఘురాముడు
అనంతపురం కల్చరల్ : వైభవంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మొదటిరోడ్డులోని శ్రీ కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో వాహన సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీసీతారాములకు అభిషేక, అలంకార సేవలు జరిగాయి. సాయంత్రం సీతా సమేతుడై శ్రీరాముడు సింహవాహనంపై ఊరేగి దర్శనమిచ్చాడు. ప్రాచీన కళారూపకాలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన మండలి బృందాలు రామనామస్మరణ మార్మోగుతుండగా భక్తులు స్వామివారికి నీరాజనాలర్పించారు. ఈ సందర్భంగా నృత్యకళానికేతన్ సంధ్యామూర్తి శిష్యబృందం శాస్త్రీయ నృత్యాలతో స్వామివారికి నీరాజనాలర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నాగేంద్రరావు, సురేష్, రామసుబ్రమణ్యం, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
సింహ వాహనంపై విశ్వమోహనుడు
– ఘనంగా పూర్వారాధన వేడుకలు – అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం – సింహవాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయలు మంత్రాలయం: విశ్వమోహనుడు సింహవాహనంపై అలరారుతూ ఊరేగుతుండగా శ్రీమఠం ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. భక్తజనం భువనమోహనుడి వైభవం తిలకించి మైమరిచారు. శ్రీరాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో రాఘవేంద్రులకు సుప్రభాతసేవ, పంచామతాభిషేకం, పుష్పాలంకరణలు గావించారు. మూలరాముల పూజ, రాయరు పాద పూజలో పీఠాధిపతి తరించిన తురణం భక్తులను ఆకట్టుకుంది. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఊంజలలో సింహవాహనంపై తూగారు. అనంతరం పండితులు వేదాలు వల్లిస్తుండగా.. మంగళవాయిద్యాలు సుస్వరనాదం వాయించగా.. భక్తులు ఉత్సవమూర్తి నామ స్మరణ అందుకున్నారు. శ్రీమఠం మాడవీధుల్లో సింహవాహనం ఊరేగిన దశ్యం మహా అద్భుతం. అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం : ఆనవాయితీలో భాగంగా వేడుకలను పురష్కరించుకుని ప్రముఖులకు రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రధానం చేశారు. యోగీంద్ర మంపడంలో పీఠాధిపతి చేతుల మీదుగా సామాజిక సేవకుడు సూర్యనారాయణరెడ్డి, సంస్కత విద్యాపీఠం ఉప కులపతి డాక్టర్ వీఆర్ పంచముఖి, అద్వైత వేదాంత, మీమాంశ సబ్జెక్టు ప్రొఫెసర్ డాక్టర్ మణిద్రవిడకు రూ.లక్ష నగదుతోపాటు రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ప్రశంశపత్రాలు అందజేశారు. గ్రహీతల సేవలు, ప్రతిభను కొనియాడారు. సాంస్కతిక ప్రదర్శనలో భాగంగా బెంగళూరుకు చెందిన ముద్దుమోహన్ సంగీత విభావరి, ముంబాయి రాధాకష్ణ నత్య శాల కళాకారులు నాట్య భంగిమలు భక్తులను అలరించాయి. వేడుకలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేడు మధ్యారాధన : ఆరాధనలో భాగంగా శనివారం మధ్యారాధన నిర్వహిస్తారు. రాఘవేంద్రుల మూల బందావనానికి మహా పంచామతాభిషేకం, గజవాహన, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు ప్రత్యేకం. భక్తులు రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు తిలకిస్తారు. -
శ్రీకృష్ణుని అవతారంలో ఆదిదేవుడు
-
తిరుమలలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఏడో రోజుకు చేరుకుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ విధుల్లో ఊరేగుతున్నారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో 24 కంపార్టెమెంట్లలు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. కాగా ఈ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవేంకటేశ్వరుడు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో విధులన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.