సింక్వీఫీల్డ్ కప్ టోర్నీలో ఆనంద్‌కు రెండో స్థానం
ప్రతిష్టాత్మక సింక్వీఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ చాంప్ కార్ల్సన్ (నార్వే) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఆనంద్‌కు రెండో స్థానం, కార్ల్‌సన్‌కు మూడో స్థానం లభించాయి. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో 6 పాయింట్లతో లాగ్రెవ్ (ఫ్రాన్స్) విజేతగా నిలిచాడు. లాగ్రెవ్కు 75 వేల డాలర్లు (రూ. 48 లక్షలు), ఆనంద్‌కు 50 వేల డాలర్లు (రూ. 32 లక్షలు), కార్ల్‌సన్‌కు 40 వేల డాలర్లు (రూ. 25 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.