Sindhu janagam
-
రన్నరప్ సింధు జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి శరణ్య శెట్టితో కలిసి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సింధు (తెలంగాణ)– శరణ్య (మహారాష్ట్ర) జంట 4–6, 6–1, 6–10తో అవిష్క గుప్తా (జార్ఖండ్)–ఎం. ఆర్తి (తమిళనాడు) జోడీ చేతిలో సూపర్ టైబ్రేక్‌లో పరాజయం పాలైంది. -
రన్నరప్ సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సింధు జనగాం ఆకట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన టైటిల్ పోరులో సింధు (తెలంగాణ)– మహ్రుక్ కోక్ని (మహారాష్ట్ర) ద్వయం 2–6, 4–6తో తీర్థ ఇస్కా (ఏపీ)– ప్రీతి ఉజ్జిని (కర్ణాటక) జోడి చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సింధు–మహ్రుక్ ద్వయం 6–4, 6–2తో ధారణ–నవనీ (ఛత్తీస్‌గఢ్) జంటపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం క్వార్టర్స్‌కు చేరుకుంది. బెంగళూరులో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు (తెలంగాణ) 1–0తో ఆధిక్యంతో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి ప్రీతి ఉజ్జిని (కర్నాటక) గాయం కారణంగా వైదొలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌలిక రామ్ 4–6, 6–2, 7–5తో ఏపీకి చెందిన మరో క్రీడాకారిణి ఇస్కా తీర్థపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సృష్టి దాస్ (మహారాష్ట్ర) 6–0, 6–2తో సొనాలి జైశ్వాల్ (ఏపీ)ని ఓడించింది.