స్టార్ సింగర్ ఆత్మహత్య.. ఆ బాధ తట్టుకోలేక!
ప్రముఖ సింగర్, నటి కోకో లీ(48) మరణించింది. పాప్ సింగర్ అయిన ఈమె.. ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చిన చైనీస్ అమెరికన్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాంకాంగ్ లో పుట్టిన ఈమె.. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి, అక్కడే చదువుకుంది. అనంతరం సొంత దేశానికి తిరిగొచ్చేసి సింగర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎంతో క్రేజ్ దక్కించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అభిమానులని కంటతడి పెట్టిస్తోంది.
దాదాపు 30 ఏళ్ల పాటు పాప్ సింగర్ కెరీర్ ని కొనసాగిస్తూ వచ్చిన కోకో లీ.. గత కొన్నాళ్ల నుంచి డిప్రెషన్ తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే జూలై 2న ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఆమె కోమాలోకి వెళ్లినట్లు తేలింది. అలా ఆమెని బతికించేందుకు డాక్టర్స్ చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కోకో లీ బుధవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె చెల్లెళ్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: కాలు విరగ్గొట్టుకున్న నవదీప్.. ఆ నటి మాత్రం!)
2001లో కోకో లీ పాడిన.. 'ఏ లవ్ బిఫోర్ టైమ్' సాంగ్ ఉత్తమ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ క్రమంలోనే అవార్డుల ప్రదానోత్సవంలో ఈమె స్టేజీ షో ఇచ్చింది. ఈ ఘనత సాధించిన తొలి చైనీస్ అమెరికన్ గా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 1996లో సోనీ మ్యూజిక్ తో ఒప్పందం చేసుకున్న మొదటి చైనీస్ గాయనిగానూ నిలిచింది. డిస్నీ 'ములాన్' సినిమాలోని హీరోయిన్ ఫా ములాన్ కు వాయిస్ ఇచ్చింది కూడా ఈమెనే కావడం విశేషం.
90వ దశకంలో పాప్ సింగర్ గా చాలా పేరు తెచ్చుకున్న కోకో లీ.. హాంకాంగ్, మలేసియా, తైవాన్, సింగపూర్, ఆస్ట్రేలియాలో చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రేమ, విశ్వాసం అని తన చేతుల మీద టాటూలు వేయించుకున్న ఫొటోలని తన ఇన్ స్టాలో చివరగా లీ షేర్ చేసింది. 'మీరు ఒంటరిగా లేరు, నేను మీతో ఉంటాను' అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చివరగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడది అది చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు.
I am shocked to learn that #CocoLee passed. Horrible news.
What a huge blow to our #Mulan family. 😢💔
She was a vivacious, beautiful and talented artist. My condolences to her family, friends & fans.
RIP🙏🏼💔 pic.twitter.com/lf3Bk6a2ml
— Ming-Na Wen (@MingNa) July 6, 2023
(ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?)