singireddy bhaskar reddy
-
కరీంనగర్ కోర్టులో కోడెలకు చుక్కెదురు
-
కోడెల శివప్రసాద్‌కు చుక్కెదురు
సాక్షి, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. జూన్ 18న కోర్టుకు హాజరుకావాలని స్పెషల్ మొబైల్ కోర్టు కోడెలను ఆదేశించింది. 2014 ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో తెలిపారు. దీంతో ఎన్నికల నిబంధలనను ఉల్లంఘించిన కోడెలను అనర్హులుగా ప్రకటించాలని కరీంనగర్‌కు చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోడెలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అవ్వడంతో, 2017 మార్చి 7న కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే కోడెల హైకోర్టును ఆశ్రయించి.. కోర్టుకు స్వయంగా హాజరుకాలేనని స్టే ఆర్టర్ తెచ్చుకున్నారు. దీంతో స్టే ఆర్డర్‌ను సవాల్ చేస్తూ, ఇటీవల సుప్రీంకోర్డు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భాస్కర్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వాదోపవాదనల అనంతరం జూన్ 18న కోడెల స్వయంగా కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి రాజు ఆదేశించారు. -
'ఏం సాధించారని సంబరాలు'
కరీంనగర్: ఏం సాధించారని టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పేరు వస్తుందనే అక్కసుతో రీ డిజైనింగ్ పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి నీళ్లు తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. రీడిజైన్ తో ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పత్తి కొనుగోళ్లలో జాప్యంపై వైఎస్సార్సీపీ ఆందోళన
పత్తికొనుగోళ్లలో నెలకొన్న తీవ్రజాప్యం, దళారుల మోసాలపై వైఎస్సార్సీసీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డు నుసందర్శించిన వైఎస్సీర్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్.. పత్తి కొనుగోళ్లలో జాప్యం, మోసాలపై నేతలు ఆగ్రహం వ్యక్తచేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేయాలని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కెట్ యార్డు అధికారులను కోరారు. పరిస్థితిలో మార్పు రాకుంటే రైతుల పక్షాన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి పెరుగుతున్న ఆదరణ
హుస్నాబాద్‌రూరల్/చిగురుమామిడి/కోనరావుపేట, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్సార్సీపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మేనిఫెస్టోను పరిశీలిస్తున్న ప్రజలు పార్టీకి చేరువవుతున్నారు. దివంగత మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పాలన తిరిగి రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిందే అంటున్నారు. యువకులు, విద్యావంతులు, మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలం నందారంలో సుమారు వంద మంది గిరిజనులు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మీసాల రాజారెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారి సమక్ష్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో చట్ల సంతోష్,పి.సంతోష్, శ్రీనివాస్, కొలిపాక నాగరాజు, శ్రీకాంత్, నాగరాజు, రాజు, అశోక్, అజయ్, శివరామకృష్ణ, సురేశ్, అనీల్, చంద్రయ్య, నర్సయ్య తదితరులు ఉన్నారు. రాజన్న రాజ్యం వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని వారు అభి ప్రాయపడ్డారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల, ధర్మారం గ్రామాల్లో సుమారు 350 మంది యువకులు వైఎస్సార్సీపీ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి ముస్కు వెంకటరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బీళ్లకు నీళ్లు మళ్లించిన వైఎస్ మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీడు భూములకు నీళ్లు మళ్లించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని నందారం, మడద, రాములపల్లిలో ప్రచారం నిర్వహించారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల పను లు వేగవంతం చేశారన్నారు. ఆయన మరణానంతరం తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆవేదన చెందారు. అందుకే ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. నేదూరి మహేశ్, జక్కుల మహేశ్, నూనె నగేశ్, శేఖర్, రమేశ్, శ్రీనివాస్‌గౌడ్ శ్రీనివాస్‌గౌడ్ తదతరులు పాల్గొన్నారు.