సింగిల్ బ్రాండ్ స్టోర్స్‌కు అనుమతించండి
మళ్లీ దరఖాస్తు చేసిన యాపిల్
న్యూఢిల్లీ: సింగిల్-బ్రాండ్ రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయడానికి యాపిల్ సంస్థ మళ్లీ దరఖాస్తు చేసింది. గతంలో సమర్పించిన దరఖాస్తు సమగ్రంగా లేనందున తాజాగా ఈ దరఖాస్తును ఐఫోన్, ఐప్యాడ్లు తయారు చేసే యాపిల్ కంపెనీ సమర్పించింది. ఈ ప్రతిపాదనను డిపార్ట్మెంట్ ఆప్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) పరిశీలిస్తోందని డీఐపీపీ ఉన్నతాధికారొకరు చెప్పారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావొమి కూడా ఈ తరహా దరఖాస్తునే సమర్పించిందని వివరించారు.
సింగిల్-బ్రాండ్ రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయడానికి, ఆన్లైన్లో వస్తువులను విక్రయించడానికి అనుమతించాలంటూ ఈ ఏడాది జనవరిలోనే యాపిల్ కంపెనీ దరఖాస్తు చేసింది. అయితే ఈ దరఖాస్తు సమగ్రంగా లేదని, మరిన్ని వివరాలు కావాలంటూ డీఐపీపీ యాపిల్‌కు తెలిపింది.