సిరిమంతుడు.. సత్యదేవుడు
అన్నవరం దేవస్థానం 2017–18 బడ్జెట్ రూ.142.59 కోట్లు
ఆమోదించిన దేవస్థానం పాలకవర్గం
అన్నవరం :
భక్తుల కోర్కెలు తీర్చే భక్తవరదుడు, రత్నగిరివాసుడు సత్యదేవుడు ‘సిరి’మంతుడుగా వెలుగొందుతున్నాడు. మూడేళ్ల క్రితం స్వామివారి ఆదాయం రూ.వంద కోట్లకు చేరిందని తెలిసి పలువురు ఆశ్చర్యపోయారు. అయితే 2015–16లో స్వామివారి ఆదాయం రూ.120 కోట్లు, 2016–17 లో రూ.132 కోట్లకు చేరింది. తాజాగా 2017–18లో సత్యదేవునికి రూ.142.59 కోట్ల ఆదాయం వస్తుందని గురువారం దేవస్థానంలో జరిగిన పాలకమండలి బడ్జెట్ సమావేశంలో అంచనా వేసింది. ఈ లెక్కన 2020 నాటికి సత్యదేవుని ఆదాయం రూ.200 కోట్లకు చేరినా ఆశ్చర్యపడనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
142.59 కోట్లతో 2017–18 బడ్జెట్ అంచనా
అన్నవరం దేవస్థానంలో 2017–18 బడ్జెట్ ప్రతిపాదనలను గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఆమోదించారు. వివిధ విభాగాల ద్వారా రూ.142,58,95,912 ఆదాయం వస్తుందని, దానిలో రూ.142.29 కోట్లు వ్యయమవుతుందని, రూ.29,95,912 మిగులు ఉంటుందని అంచనా వేశారు. దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఈఈ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్లో వ్యయాలు ఇలా..
కంట్రిబ్యూష¯ŒS కింద రూ.14.12 కోట్లు : ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీజీఎఫ్, అర్చక సంక్షేమ నిధి, ఆడిట్ ఫీజు, తదితర చెల్లింపుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.14.12 కోట్లు కేటాయించారు. దేవస్థానం ఆదాయంలో దాదాపు పదిశాతం ఈ చెల్లింపులకే కేటాయించారు. గత ఏడాది కూడా ఈ చెల్లింపులకు రూ.13.84 కోట్లు కేటాయించారు.
సిబ్బంది జీతాలు రూ.26.64 కోట్లు : 2017–18లో దేవస్థానం సిబ్బంది జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.26.64 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015–16 లో ఈ వ్యయం రూ.23.74 కోట్లు మాత్రమే.
ప్రసాదం తయారీ, ఇతర దినుసుల
కొనుగోలుకు రూ.22.81 కోట్లు
∙సత్యదేవుని ప్రసాద తయారీలో వాడే గోధుమ, నెయ్యి, పంచదార, గ్యాస్ ఇతర దినుసుల కొనుగోలుకు, దుప్పట్లు, ఇతర వస్రా్తలు, పూలదండల కొనుగోలుకు రూ.22.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతేడాది ఈ మొత్తం రూ.22.69 కోట్లు మాత్రమే.
∙పురోహితుల, నాయీబ్రాహ్మణుల పారితోషకాల చెల్లింపునకు రూ.9.50 కోట్లు
∙సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేసే పురోహితుల పారితోషకం చెల్లింపునకు రూ.8.10 కోట్లు, నాయీబ్రాహ్మణుల పారితోషకం కింద రూ.40 లక్షలు, ప్రసాదం ప్యాకర్స్ పారితోషకం చెల్లింపునకు రూ.కోటి బడ్జెట్లో కేటాయించారు.
∙నిర్మాణాలకు రూ.ఎనిమిది కోట్లు : దేవస్థానంలో వివిధ నిర్మాణ పథకాల కోసం రూ.ఏడు కోట్లు, వాటర్‌వర్క్స్ కోసం రూ.కోటి కేటాయించారు. గతేడాదితో పోల్చితే రూ.15 లక్షలు తగ్గింది.
∙స్వామివారి వార్షిక కల్యాణానికి రూ.40 లక్షలు : ఈ ఏడాది మే నెలలో జరగనున్న సత్యదేవుని వార్షిక కల్యాణ మహోత్సవాలకు రూ.40 లక్షలు, ఇతర ఉత్సవాలకు రూ.20 లక్షలు కేటాయించారు.
∙శానిటేష¯ŒS కొరకు రూ.4.31 కోట్లు : దేవస్థానంలో శానిటేష¯ŒS నిర్వహణ కోసం రూ.4.31 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. గతేడాది రూ.3.75 కోట్లు మాత్రమే కేటాయించారు.
∙విద్యుత్ ఛార్జీల కోసం రూ.2.92 కోట్లు : దేవస్థానంలో విద్యుత్ చార్జీల కోసం రూ.2.92 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.3.92 కోట్లు కేటాయించారు.
∙ట్రా¯Œ్సపోర్టు నిర్వహణకు రూ.1.12 కోట్లు : దేవస్థానం ట్రా¯Œ్సపోర్టు నిర్వహణకు రూ.1.12 కోట్లు కేటాయించారు.
∙దేవస్థానంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎస్పీఎఫ్, ఇతర సిబ్బంది కోసం రూ.2.45 కోట్లు కేటాయించారు.
∙దేవస్థానంలో ఉద్యానవనాల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రూ.కోటిన్నర కేటాయించారు.
∙వివిధ బ్యాంకుల్లో జమ చేసిన డిపాజిట్లను ఈ ఏడాదీ రెన్యువల్ చేస్తారు. ఈ విధంగా జమ చేసే డిపాజిట్లు రూ.32 కోట్లను కూడా వ్యయంగా బడ్జెట్లో చూపించారు.
అన్నదానం, గోసంరక్షణ ట్రస్ట్‌కు విడిగా బడ్జెట్లు
∙దేవస్థానంలోని సత్యదేవుని అన్నదానపథకం ట్రస్ట్ గోసంరక్షణ నిధికి ప్రత్యేక బడ్జెట్లు రూపొందించారు. అన్నదానం ట్రస్ట్‌కు రూ.27,89,30,587తో అంచనా బడ్జెట్ రూపొందించారు.
∙గోసంరక్షణకు రూ.61 లక్షలతో బడ్జెట్ రూపొందించారు.
కమిషనర్ పరిశీలనకు బడ్జెట్
ప్రతిపాదనలు : ఈఓ నాగేశ్వరరావు
2017–18 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను కమిషనర్‌కు పంపుతున్నాం. కమిషనర్ పరిశీలించిన తరువాత వాటిలో స్వల్పమార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కేటాయింపుల్లో పెద్దగా మార్పులు ఉండవు.
మూడేళ్లుగా ముఖ్య విభాగాల
ద్వారా వచ్చిన ఆదాయం
2017–18 బడ్జెట్ ఆదాయ అంచనాలు... (రూ.కోట్లలో)
విభాగం.. 2014–15 2015–16 2016–17 2017–18
వ్రతాలు 19.19 21.76 23.70 27.00
ప్రసాద విక్రయాలు 17.57 19.45 19.62 21.50
శీఘ్రదర్శనం 2.95 5.02 4.24 6.00
సత్రాల అద్దెలు 5.57 5.79 6.57 7.00
బ్యాంక్ డిపాజిట్లు 17.74 32.02 22.90 32.00
లీజులు, డిపాజిట్లు 1.69 2.63 2.44 3.00
షాపు లీజులు 6.27 7.25 9.43 11.00
తలనీలాలు 1.20 1.71 1.28 1.00
కొబ్బరి ముక్కలు 0.34 0.45 0.41 0.50
టోల్గేట్ 0.48 0.36 0.18 0.21
కల్యాణాలు 0.50 0.56 0.59 0.70
కేశఖండన 0.35 0.50 0.51 0.60