సిరిసిల్లలో జేఏసీ నాయకుల అరెస్ట్
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధన జేఏసీ నాయకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సిరిసిల్ల 48 గంటల బంద్‌లో భాగంగా ఆర్టీసీ బస్సు అద్దాలు, పెట్రోల్ బంక్‌ను ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ తెలిపారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చొక్కాల రాము(36), బీజేవైఎం నాయకుడు అన్నల్దాస్ వేణు(26), బీఎస్పీ నాయకుడు లింగంపల్లి మధూకర్(24)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారన్నారు.