‘సర్వే’పై విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: గణాంకాల సేకరణ చట్టానికి విరుద్ధంగా ఉన్న ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ గురువారం మధ్యాహ్నానికి వాయిదాపడింది. ఈ సర్వేకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, సర్వే నమూనా పత్రంలోని అంశాల గురించి పిటిషనర్ తన పిటిషన్లో ప్రస్తావించకపోవడాన్ని న్యాయమూర్తి జస్టిస్ అఫ్జల్ విలాస్ పుర్కర్ తప్పుబట్టారు.
పిటిషనర్ విజ్ఞప్తి మేరకు వీటన్నింటి గురించిన వివరాలను ప్రస్తావిస్తూ ఒక అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.గణాంకాల సేకరణ చట్టం 2008కు విరుద్ధంగా ఉన్న ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన సీతాలక్ష్మి అనే గృహిణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.