ఉల్లంఘనపై సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన శివ గ్యాంగ్ స్నాచింగ్‌కు పాల్పడిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కర్మన్‌ఘాట్ బ్రాంచ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్‌ల్లో తాకట్టు పెట్టారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించాయని పోలీసులు తేల్చారు. అయితే నగలు తాకట్టుపెట్టుకునే సమయంలో ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు ఎలా వ్యవహరించాయి అనే విషయాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంగా వివరించారు. చోరీ బంగారాన్ని తాకట్టుపెట్టుకున్నా, ఖరీదు చేసినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇదే తర హాలో వ్యవహరిస్తే వారి లెసైన్స్‌లను కూడా రద్దుచేయమని ఆర్బీఐకి లేఖ రాస్తామని ఆయన హెచ్చరించారు.
నిబంధనలు-ఉల్లంఘనలు ఇలా......
నిబంధన: పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్, ఏదైనా గుర్తింపుకార్డు, బ్యాంకు పాస్‌బుక్, టెలిఫోన్ బిల్లు, ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన లేఖ వీటిలో ఏవైనా మూడు ఆధారాలు తీసుకోవాలి.
ఉల్లంఘన: ముత్తూట్, శ్రీరామా సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీలు శివ నుంచి కేవలం పాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ జిరాక్స్ కాపీలను మాత్రమే తీసుకున్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కేవలం 18 రోజుల స్వల్ప వ్యవ ధిలోనే ఈ రెండు కంపెనీలు నగలను తాకట్టు పెట్టుకుని రుణం మంజూరు చేశారు.
నిబంధన: ఫైనాన్స్ కంపెనీలో ఆరు నెలలకుపైగా పనిచేసిన సీనియర్ అధికారి ఎవరైనా సరే ఖాతాదారుడిని ఇంటర్వ్యూ చేయాలి, వారి వేలి ముద్రలు కూడా తీసుకోవాలి
ఉల్లంఘన: శివ గ్యాంగ్ సభ్యులను ఎలాంటి ఇంటర్వ్యూ చేయలేదు. వారి వేలి ముద్రలు కూడా సేకరించలేదు.
నిబంధన: ఖాతాదారుడు సమర్పించిన మూడు గుర్తింపు పత్రాలు సరైనాలేవా అనే విషయాన్ని విచారించి నిర్దారించాలి.
ఉల్లంఘన: శివ సమర్పించిన గుర్తింపు పత్రాలపై విచారించలేదు. పరిశీలించలేదు.
నిబంధన: స్వచ్ఛమెన బంగారం లేదా కరిగించిన బంగారం ముద్దను తాకట్టు పెట్టుకోవడం నేరం. ఆభరణాలను మాత్రమే తాకట్టు పెట్టుకోవాలి.
ఉల్లంఘన: వీరు ఆభరణాలతో పాటు బంగారం ముద్దలను తాకట్టు పెట్టుకుని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (యన్బీఎఫ్సీ ) నిబంధనలు ఉల్లంఘించారు.
కలలో కూడా అనుకోలేదు...
రికవరీ విషయంలో కమిషనర్ సీవీ ఆనంద్, ఇన్చార్జ్ డీసీసీ జానకీ షర్మిల తీసుకున్న చొరవ అంతాఇంతకాదు. పోయిన బంగారు గొలుసు దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది.
- లక్షీ్ష్మనర్సమ్మ