నాగేంద్రప్రసాద్ చిత్రం ఆరో రోజు విశేషాలు
స్కిప్ట్ టు స్క్రీన్
సరదాగా ఒక సాయంత్రం
గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
ఆరో రోజు విశేషాలు
‘సరదాగా ఒక సాయంత్రం’ చిత్రం షూటింగ్ ఓ పాటతో సహా శనివారం విజయవంతంగా పూర్తయింది.
ఈ సందర్భంగా ‘గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు’ సంస్థ వారిని ఉద్దేశిస్తూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు వెల్లడించిన తమ అనుభవాలను సాక్ష్యం కోసం వీడియోగా చిత్రీకరించారు.
షూటింగ్‌తో పాటు ఎడిటింగ్‌ను కూడా ఈ చిత్రం ఏకకాలంలో పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 50 శాతం
రీ-రికార్డింగ్ పూర్తయింది.
ఆదివారం నుంచి మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
‘‘పరిమిత కాలవ్యవధిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏకకాలంలో అన్ని విభాగాలూ యుద్ధప్రాతిపాదికన పనిచేయడం నాకు ఆసక్తిగా అనిపించింది. ఈ యూనిట్ లో భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉంది.’’
- మధు లగ్న దాస్
కథానాయికల్లో ఒకరు