అడ్డంగా బుక్కయిన ఐటీ అధికారి
ముంబై: పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి ఒకరు సీబీఐకి పట్టుబడ్డారు. ముంబైకి చెందిన ఐటీ అధికారి ఎం. జాగ్రన్ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సీబీఐకి దొరికారు. ముంబైలోని ఐటీ కార్యాలయంలో శుక్రవారం సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
సదరు ఆఫీసర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో నిఘా పెట్టామని సీబీఐ అధికారులు తెలిపారు. పన్నుఎగవేసేందుకు గాను ఓ ప్రైవేటు కంపెనీ యజమాని నుంచి రూ. 5 లక్షలు డిమాండ్ చేశారనే సమాచారంతో దాడులు జరిపినట్టు వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామన్నారు.
కాగా గతంలో ఇదే ఆఫీసులో రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఐటి కమీషనర్ దయా శంకర్ సీబీఐ అధికారులకు చిక్కారు.