skulls-bones
-
40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే..
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్.బి.ఐ అధికారులకి ఒక విచిత్రమైన కేసు ఎదురైంది. కెంటక్కీలోని ఒక వ్యక్తి మీద అనుమానంతో అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా నేను, నాతో పాటు చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఇంటి లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు చక్కగా అలంకరించి ఉన్నాయి. దీంతో అధికారులు అతడిని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల హార్వార్డ్ మెడికల్ స్కూల్ శవాగారం నుండి చాలా వరకు మృతదేహాల అవశేషాలు దొంగిలించబడుతున్నాయని ఎఫ్.బి.ఐకి ఫిర్యాదు చేశారు సదరు స్కూలు సిబ్బంది. అప్పటి నుండి కేసు దర్యాప్తు చేసున్న ఎఫ్.బి.ఐ అధికారులకు కెంటక్కీకి చెందిన జేమ్స్ నాట్(39) పై అనుమానం వచ్చింది. పోలీసులు అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని విచిత్రమైన సమాధానమిచ్చాడట. ఇంకేముంది పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి నిండా ఎక్కడ చూసినా ఆస్తిపంజరాలు, పుర్రెలే. ఫర్నీచర్ చుట్టూ మానవ అవశేషాలను చక్కగా అలంకరించుకున్నాడట జేమ్స్. ఒక హార్వార్డ్ స్కూలుకు సంబంధించిన బ్యాగ్ కూడా అక్కడ దొరకడంతో తాము వెతుకుతున్న నేరస్తులలో జేమ్స్ ఉండి ఉంటాడని అనుమానంతో దర్యాప్తు చేశారు అధికారులు. తీగలాగితే.. జేమ్స్ నాట్ ఇల్లంతా తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు దొరికాయి. అతడి పేస్ బుక్ మెసేజులన్నీ పరిశీలించగా అతడు జెరెమి పాలీ అనే వ్యక్తితో మానవ అవశేషాల కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు నడుపుతున్న విషయం బయటపడింది. ఇంటిలో కొన్ని మారణాయుధాలు కూడా దొరకడంతో అక్రమ్మగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతోనూ, నిషేధిత వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న నేరం కింద జేమ్స్ నాట్ ని అరెస్టు చేశారు. జెరెమి పాలీ కోసం గాలిస్తున్నారు. జెరెమి పాలీ, జేమ్స్ నాట్ వీరంతా మానవ అవశేషాలను విక్రయించే ముఠాకు చెందిన వారిని.. వీరు శరీరంలోని ఎముకల తోపాటు చర్మాన్ని కూడా అమ్ముకుంటారని తెలిపారు ఎఫ్.బి.ఐ అధికారులు. ఇది కూడా చదవండి: భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక.. -
పదుల సంఖ్యలో పుర్రెలు...గాజు సీసాలో పిండం!
మెక్సికో సిటీ: డ్రగ్స్ మాఫియా అడ్డాపై దాడి చేసిన మెక్సికో నగర పోలీసులకు విస్తుపోయే దృశ్యాలు దర్శనమిచ్చాయి. మెక్సికోలోని టెపితో అక్రమ వ్యాపారాలకు అడ్డాగా పేరుగాంచింది. గతవారం పోలీసులు ఈ ప్రాంతంలో జరిపిన రైడ్‌లో ఒళ్లు గగుర్పొడిచే అనేక విషయాలు బయటపడ్డాయి. దాడిచేసిన ప్రాంతంలో 40కి పైగా పుర్రెలు, డజన్ల కొద్ది ఎముకలు, వీటితో పాటు ఒకగాజు సీసాలో ఉంచిన పిండంను పోలీసులు కనుగొన్నారు. అదే విధంగా నాలుగు పుర్రెలతో నిర్మించన బలిపీఠాన్ని పోలీసులు అక్కడ గుర్తించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలను మెక్సికో పోలీసులు విడుదలచేశారు. కాగా ఈ కేసుకు సంబంధించిన 31 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 27 మందిని విడుదల చేయమని కోర్టు ఆదేశించగా వారిని విడిచిపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపడుతున్నట్లు అటర్నీజర్నల్ ఆఫీసు అధికారిణి తెలిపారు. గాజు జార్లో లభ్యమైన పిండం మనిషిదా లేదా జంతువులదా అన్నది ఇంకా తెలియదు అని పేర్కొన్నారు. బలిపీఠంపై ఉన్న గుర్తులు, రంగు రంగుల ముద్రల ఆధారంగా క్షుద్రపూజల నేపథ్యంలో కేసును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే డ్రగ్ నేరగాళ్ల అడ్డాగా మారిన మెక్సికో సిటీలో ఇటువంటి సంచలన విషయాలు బయటపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
'పుర్రెలు, ఎముకలతో జంతర్‌మంతర్‌కు..'
న్యూఢిల్లీ: తమిళనాడులు రైతులు పుర్రెలు, ఎముకలతో ఢిల్లీ బాటపట్టారు.. రుణమాఫీ కోసం, కరువు భృతికోసం ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 41 రోజులపాటు ఢిల్లీ నడిబొడ్డున సుదీర్ఘ ఆందోళనలు నిర్వహించి వెళ్లిన వారు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరినే ప్రదర్శించడంతో చేసేదేం లేక మరోసారి జంతర్‌మంతర్‌కు చేరారు. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ఎండా వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ సమస్య తీవ్రతను సమాజానికి తెలియజేస్తామని స్పష్టం చేస్తూ పుర్రెలు, ఎముకలతో దీక్షా స్థలికి చేరుకున్నారు. 'వానలు రానీ, ఎండలు కొట్టని మా ఉద్యమం మాత్రం ఈసారి ఆగదు' అని అని నేషనల్ సౌత్ ఇండియన్ రివర్స్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ అక్కక్కాను చెప్పారు. కనీసం ఈసారి వందమంది రైతులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి వంద రోజులపాటు ఆందోళన నిర్వహించనున్నారు. తొలుత ఈ వారం ప్రారంభంలో వచ్చిన రైతులు ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ఇక జంతర్‌మంతర్ వద్ద ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.