ఫర్టిలైజర్ షాపుపై స్పెషల్‌స్క్వాడ్ దాడులు
నల్లబెల్లి : మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపులపై హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ స్క్వాడ్ ఏడీఏ మదన్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు జరిపి తనిఖీలు నిర్వహిం చారు. ఎరువులు కొనుగోలు చేసి తీసుకెళుతున్న రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే రైతులకు విక్రయించిన ఎరువుల బస్తాలపై ఆరా తీశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఈ దాడుల్లో నర్సంపేట ఏడీఏ శ్రీనివాస్‌రావు, స్పెషల్స్కాడ్ ఏఓ అనిల్‌కుమార్, నర్సంపేట, నల్లబెల్లి ఏఓలు యాదగిరి, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.