Sleep counseling
-
హాయిగా పడుకుంటే రూ. లక్ష గ్యారెంటీ..
న్యూఢిల్లీ: భారతీయ స్టార్టప్ ఓ వినూత్న కోర్సును ప్రవేశపెట్టింది. సాధారణంగా ఇంటర్న్‌షిప్ అంటే ఏ ఆర్నెళ్ల కోర్సు అని అనుకుంటారు కానీ ఇక్కడ నిద్రపోవడానికి శిక్షణ ఇస్తుండడం విశేషం. వివరాల్లోకి వెళితే.. స్లీప్ సొల్యూషన్స్ వేక్ ఫిట్ అనే స్టార్టప్ సంస్థ 2020 ఇంటర్న్‌షిప్ బ్యాచ్‌కు దరఖాస్తులు కోరింది. ఈ కోర్సుకు ఎంపికైన వారికి ఉపకార వేతనంగా లక్ష రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎవరికైనా స్వతహాగా నిద్రపోయే అభిరుచి ఉండి ఇచ్చిన సమయంలో నిద్రపోవడమే ఈ కోర్సుకు కావాల్సిన అర్హతలుగా సంస్థ పేర్కొంది. రోజుకు తొమ్మిది గంటలు వారానికి 100గంటలు నిద్రించాలని సంస్థ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ కోర్సులో చేరే వారికి డ్రస్ కోడ్‌గా పైజామాను నిర్ణయించారు. మరోవైపు దేశంలో ఎక్కువగా నిదించ్రేవారిని నియమించేందుకు ఈ కోర్సు ఎంతో ఉపకరిస్తుందని స్లీప్ సొల్యుషన్స్ డైరెక్టర్ చైతన్య రామలింగగౌడ తెలిపారు. గౌడ మాట్లాడుతూ..ఇంటర్న్‌షిప్‌లో నిద్రపోయేందుకు మెళుకువలను నేర్పిస్తామని అన్నారు. అభ్యర్థులకు కౌన్సెలింగ్ సెషన్స్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు నిద్రపోయే ముందు, నిద్రపోయిన తర్వాత వారి అనుభవాలు తెలుసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జీవితంలో అనుకున్న పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలంటే నిద్ర అనేది చాలా ముఖ్యమైనదని అన్నారు. ఇలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిర్ణీత సమయం నిద్రించడం.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారని చెప్పారు. -
స్లీప్ కౌన్సెలింగ్స్
గట్టిగా గురక... పరిష్కారం చెప్పండి తన వయసు 45 ఏళ్లు. అప్పుడప్పుడూ మద్యం తాగుతాను. రాత్రివేళల్లో మద్యం తాగే అలవాటు ఉంది. నేను గురకతో బాధపడుతున్నాను. ఇటీవల ఫ్రెండ్స్‌తో టూర్‌కు వెళ్లాను. గదిలో, కారులో పడుకున్న వెంటనే గురకపెట్టడం మొదలుపెట్టాను. ఆ టూర్ మొత్తంలో నాతో పాటు గదిలో ఉండటానికి ఫ్రెండ్స్ ఎవరూ ఇష్టపడలేదు. ఇంట్లోనూ ఇదో సమస్య అవుతోంది. మానసికంగా బాగా కలత చెందుతున్నాను. నా సమస్య తగ్గేదెలా? – ఎన్. సూర్యనారాణయ, ఖమ్మం శ్వాసతీసుకోవడంలో కలుగుతున్న అంతరాయానికి గురక ఒక గుర్తు. దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. మన జనాభాలో 45 శాతం మంది అప్పుడప్పుడూ, 25 శాతం మందిలో రోజూ గురక పెడుతుంటారు. స్థూలకాయుల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువ. మనం నిద్రపోగానే అన్ని అవయవాలూ రిలాక్స్ అయినట్లే శ్వాసనాళమూ మెత్తబడుతుంది. అలా మెత్తబడిన శ్వాసనాళంతో పాటు, నాలుక చివరి భాగం, అంగిలిలోన, గొంతు ముందు భాగం వద్ద గాలి ప్రకంపనలు సంభవిస్తాయి. ఆ కంపన వల్ల నోటి నుంచి, ముక్కు నుంచి ఒకరకమైన శబ్దం వస్తుంది. అదే గురక. గురక వస్తుందంటే ఈ కింది సమస్యలకు అది సూచన కావచ్చు: ♦ గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. సమస్య తీవ్రం కావచ్చు ♦ కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు ♦ కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు ♦ ఇక మరికొందరిలో ముక్కు దూలం కాస్త వంకరగా ఉండటం వల్ల కూడా గురక రావచ్చు. ఇక మీలాగే న్యూనతకు గురయ్యే వ్యక్తులు కొందరు కునుకు తీయడానికి కూడా భయపడి నిద్రలేమితో బాధపడతారు. గురకలో శ్వాస అందని పరిస్థితిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. గుండె రక్తసరఫరా కోసం ఆక్సిజన్ కోసం మరింత ఎక్కువ శ్రమిస్తుంది. చికిత్సలు: గురకకు అనేక రకాలుగా చికిత్స చేస్తుంటారు. ఉదాహరణకు కొందరిలో ముక్కుకు ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తొడుగుతారు. దీన్ని సీపాప్ చికిత్స అంటారు. ∙ఇక మరికొందరిలో ‘ఉవాలోపాలటోఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు. నివారణ: గురకను నివారించడానికి కొన్ని సూచనలు ♦ మీ బరువును అదుపులో పెట్టుకోడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి ♦ నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, అలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీహిస్టమైన్స్ తీసుకోకండి ♦ మీరు ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి ∙నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి ♦ వెల్లకిల పడుకోడానికి బదులుగా ఒకవైపునకు ఒరిగి పడుకోండి ♦ మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి. మెలకువ రాగానే కదలలేక పోతున్నాను! నా వయసు 50. నాదో చిత్రమైన సమస్య. నేను నిద్రలేచాక చాలాసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు ఇవేవీ కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి చూడగలుగుతున్నాను అంతే. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు ఉంటోంది. కొద్దిసెకన్లే అయినా నాకు చాలా ఆందోళనగా ఉంది. నా సమస్య ఏమిటి? ఇది తగ్గెదెలా? – ఆర్. సర్వేశ్వరరావు, కాకినాడ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీరు స్లీప్ పెరాలసిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువ స్థితికి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం స్పందించాలనుకున్నా ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఈ స్లీప్ పెరాలసిస్ అన్నది రెండు సమయాల్లో కలుగుతుంది. మొదటిది... నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; రెండోది నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు. స్లీప్ పెరాలసిస్ అన్నది చాలా అరుదైన రుగ్మత కాదు. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో (అడాలసెన్స్లో) ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. స్లీప్ పెరాలసిస్ అన్నది సాధారణంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇది వచ్చేందుకు దోహదపడే మరికొన్ని అంశాలివి... ♦ నిద్రలేమి ♦ మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం ♦ బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధులు ♦ ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం ♦నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం ♦ కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్‌డీకి వాడేవి) ♦ తీవ్ర అవమానానికి గురికావడం చికిత్స: స్లీప్ పెరాలసిస్ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 – 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటికి చికిత్స చేయడం ద్వారా కూడా దీనికి చికిత్స చేయవచ్చు. నిద్రలో కాళ్లు కదులుతున్నాయి ఎందుకు? నా వయసు 52 ఏళ్లు. ఒకింత స్థూలకాయంతో ఉంటాను. గత 12 ఏళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇటీవల నేను గమనించిన అంశం ఏమిటంటే... రాత్రివేళ నా ప్రయత్నం లేకుండానే నేను కాళ్లను కుదుపుతున్నట్లు కదిలిస్తున్నాను. దాంతో నిద్రాభంగం అవుతోంది. పైగా పగలంతా చాలా మగతగా, డల్‌గా ఉంటున్నాను. నా సమస్యకు కారణాలేమిటి? తగ్గే మార్గం ఉందా? – డి. హనుమంతరావు, అనంతపురం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు పీఎల్‌ఎమ్‌డీ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా నిద్రలో ఇలా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రజబ్బులో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తూ ఉంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్ఎమ్డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్ఎమ్డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ♦ డయాబెటిస్ ♦ ఐరన్ లోపం ♦ వెన్నెముకలో కణుతులు ♦ వెన్నెముక దెబ్బతినడం ♦ స్లీప్ ఆప్నియా (గురక సమస్య) ♦ నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) ♦ యురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి. పీఎల్ఎమ్డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు. - డాక్టర్ రమణ ప్రసాద్ ,కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
స్లీప్ కౌన్సెలింగ్
మావాడు రాత్రి చాలాసేపు మేల్కొనే ఉంటున్నాడు మా అబ్బాయి వయసు 14 ఏళ్లు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మేం ఎంతగా నిద్రపుచ్చడానికి ప్రయత్నించినా రాత్రివేళ త్వరగా పడుకోవడం లేదు. ఒక్కోసారి ఒంటిగంట వరకు మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటున్నాడు. లైట్లు ఆర్పేసినా వాడు నిద్రపోవడం లేదు. అదేమిటంటే నిద్రపట్టడం లేదని అంటున్నాడు. ఇలా నిద్రపోకపోవడం వల్ల వాడికి ఏదైనా నష్టమా? దయచేసి చెప్పండి. – షేక్ సుహానా, హైదరాబాద్ చిన్నపిల్లలకు నిద్ర చాలా అవసరం. పిల్లలు నిద్రలేమితో బాధపడుతుంటే అది భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఈ వయసులో కంటినిండా నిద్రతో వాళ్ల జ్ఞాపకశక్తి మరింత ఇనుమడిస్తుంది. నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనం ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణం ఈ తరంగాలే. 2009లో అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం మన జ్ఞాపకాలు మన మెదడులోని హిప్పోక్యాంపస్ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలుగా నిల్వ ఉంటాయి. తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మన కంప్యూటర్లో నిల్వ ఉంచుకోడానికి స్థలం సరిపోదని, డాటాను ఏదైనా హార్డ్ డిస్క్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా... అలాగన్నమాట. ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్‌గా మారి శాశ్వతంగా ఉండిపోతాయి. అందుకు కారణమైన ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ కేవలం గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. అందుకే పిల్లలు చదివింది జ్ఞాపకం ఉండాలంటే వాళ్లకు కంటినిండా నిద్ర ఉండాలి. అంతేకాదు ఒకవేళ పిల్లల్లో తగినంత నిద్రలేకపోతే వారు భవిష్యత్తులో మానసిక సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది. డిప్రెషన్, యాంగై్జటీ వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే నిద్రకు ముందు టీవీలో ఉద్వేగపరమైన సన్నివేశాలున్న సినిమాలు చూడనివ్వకండి. ఇక మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వంటివి బ్లూ–లైట్‌ను వెదజల్లుతాయి. ఈ బ్లూ–లైట్ మెదడును ఉత్తేజితం చేసి, నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే నిద్రపుచ్చడానికి కనీసం మూడు గంటల ముందు నుంచి పిల్లలను ఈ ఉపకరణాలకు దూరంగా ఉంచండి. ఇక కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి కెఫిన్ ఉండే డ్రింక్స్ తాగనివ్వకపోవడం వల్ల మంచి నిద్రపడుతుంది. మంచి నిద్ర పట్టేలా చేసేందుకు రాత్రి బాబుకు గోరువెచ్చని పాలు తాగించడం మంచిది. ఇందులో నిద్రను ప్రేరేపించే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉన్నందున అది నిద్రకు పురిగొల్పుతుంది. ఇవన్నీ చేశాక కూడా పిల్లలు నిద్రకు ఉపక్రమించడం లేదంటే ఒకసారి స్లీప్ స్పెషలిస్ట్‌ను కలవండి. నిద్రలో అలా కాళ్ల కదలికలు ఎందుకు? నా భార్య వయసు 47 ఏళ్లు. ఆమె కొన్నేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతోంది. ఇటీవల మేం గమనించిందేమిటంటే నిద్రలో ఆమె తన కాళ్లను చాలా వేగంగా కదిలిస్తోంది. ఎందుకలా జరుగుతోంది? దయచేసి తగిన పరిష్కారం చూపండి. – కె. మోహన్‌రావు, మార్టూరు నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. మనం నిద్రపోతున్న సమయంలో మన ఊపిరితిత్తులు, డయాఫ్రమ్ కదలిక తప్ప ఒంట్లో మరే కదలికా సాధారణంగా కనిపించదు. కానీ పీఎల్‌ఎమ్‌డీ నిద్రలో కదలికలు ఉండేలా చేస్తుంది. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్ఎమ్డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్ఎమ్డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙డయాబెటిస్ ∙ఐరన్ లోపం ∙వెన్నెముకలో కణుతులు ∙వెన్నెముక దెబ్బతినడం ∙స్లీప్ ఆప్నియా (గురక సమస్య) నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) ∙యురేమియా (రక్తంలో యూరియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి. పీఎల్ఎమ్డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు ప్రత్యేకంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని కొంతవరకు ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు. పాప నిద్రలో ఉలిక్కిపడి మేల్కొంటోంది..! మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. నిద్రలోంచి ఉలిక్కిపడి మేల్కొంటోంది. కెవ్వున అరుస్తోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. అమ్మాయి ఎందుకిలా చేస్తోంది. తగిన సలహా ఇవ్వండి. – డి. జనార్దన్, వైరా మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అమ్మాయి ‘స్లీప్ టెర్రర్’ అనే సమస్యతో బాధపడుతోంది. నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేవడం, భయపడటం, ఆందోళన పడటం, కెవ్వున అరవడం ఇవన్నీ నిద్రకు సంబంధించిన ఈ తరహాకు చెందిన సమస్యలే. నిద్రలోని ఒక దశ అయిన... కనుపాపలు చలించని స్థితి (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్–నాన్ ఆర్ఈఎమ్) దశలో కనిపించే సమస్య ఇది. నిద్రలో నడవడం కూడా ఈ తరహా సమస్య కిందికే వస్తుంది. సాధారణంగా తాము పరిష్కరించలేని సమస్యను ఎదుర్కొంటూ పిల్లలు బాగా ఆందోళనపడ్డప్పుడు ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు అకస్మాత్తుగా లేచి, ఈ నైట్‌టెర్రర్ దశలో 1–2 నిమిషాలుంటారు. తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. వాళ్లకు సాంత్వన కలిగిస్తే ఈ పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. ఈ స్థితిలో ఉన్న చిన్నారులను చూసి, తల్లిదండ్రులు ఆందోళనపడటం చాలా సాధారణం. అయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలామందిలో ఈ సమస్య యుక్తవయసు రాగానే తగ్గుతుంది. వాళ్లు ఒకప్పుడు అలా ప్రవర్తించారన్న విషయమే వాళ్లకు గుర్తుండదు. ఇదేమీ మానసిక సమస్య కాబోదు. ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పెద్దయ్యాక కూడా ఈ పరిస్థితి వస్తూంటుంది. యుక్తవయస్కుల్లో కూడా ఈ సమస్య వస్తుందంటే... బహుశా వాళ్లు యాంగై్జటీ లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కోసారి నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఉండే మైగ్రేన్, స్లీప్ఆప్నియా వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. మీపాప ఏదైనా సమస్య గురించి ఆందోళన పడుతున్నా, ఏదైనా పరిస్థితి గురించి భయపడుతున్నా... ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలమనే నమ్మకాన్ని ఆమెలో నింపి, ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పండి. వీలైతే మీరు ఒకసారి స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. - డాక్టర్ రమణ ప్రసాద్ ,కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
మీ సమస్య స్లీప్ పెరాలసిస్ కావచ్చు...
నా వయసు 50. నేను నిద్రలేచాక కొద్దిసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి ఉంచగలను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు కొనసాగుతోంది. దీంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – వెంకటయ్య, డోర్నకల్ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు స్లీప్ పెరాలసిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలో లేదా నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువకి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. స్లీప్ పెరాలసిస్ నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు సంభవిస్తుంది. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. ఇది వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇందుకు దోహదపడే మరికొన్ని అంశాలు... ∙నిద్రలేమి ∙మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం ∙బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధులు ∙ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం ∙నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం ∙కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్‌డీకి వాడేవి) ∙తీవ్ర అవమానానికి గురికావడం చికిత్స: స్లీప్ పెరాలసిస్ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 – 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్యాంక్రియటైటిస్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకూ దెబ్బ! నా వయసు 36 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు చాలా నీరసంగా ఉంటోంది. బరువు కూడా తగ్గాను. తరచు పొత్తి కడుపులో నొప్పి. రక్తపరీక్ష చేయించుకున్నాను. షుగర్ ఉన్నట్లు తేలింది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడదామని వెళ్తే, ఆయన కొన్ని ఇతర పరీక్షలు చేసి, నేను అక్యూట్ పాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్నానని, వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రమాదమన్నారు. నేను తరచూ మద్యం తాగుతాను. అందుకే ఈ వ్యాధి వచ్చిందా? – డి. దాస్, విజయవాడ పాంక్రియాటైటిస్ అనేది తీవ్రమైన వ్యాధి కాదు. కానీ దీర్ఘకాలం దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. పాంక్రియాస్ (క్లోమ గ్రంథి) చిన్నపేగుకు పక్కనే ఉండి జీర్ణప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్, ఇన్సులిన్, సొమటోస్టాటిన్ అనే హార్మోన్లను రక్తంలోకి విడదుల చేసి దానిని శక్తిగా మారుస్తుంది. డయాబెటిస్ నుంచి కూడా ఈ గ్రంథి కాపాడుతుంది. ఈ రసం ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీన్ని పాంక్రియాటైటిస్ అంటారు. కొన్ని సందర్భాల్లో క్లోమరసంలో ప్రోటీన్లు పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు మితిమీరిన మద్యంపానం, జన్యువుల ప్రభావం, జంక్‌ఫుడ్ కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. అయితే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొన్నేళ్ల తర్వాత బయటపడతాయి. మీకు ఈ వ్యాధి చాలాకాలం నుంచి ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువతో పాటు బరువు తగ్గడం లాంటి లక్షణాలతో బాధపడ్డారు. మీరు వెంటనే మద్యం పూర్తిగా మానేయండి. దీనిని మొదటిదశలోనే కనిపెట్టకపోతే వ్యాధి ముదిరి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మీకు రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ లాంటివి చేయాల్సి ఉంటుంది. క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స అందించాలి. లేకపోతే ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ కాస్తా ‘క్రానిక్ పాంక్రియాటైటిస్’గా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి చెడిపోయే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాలలో మందులతో ఈ జబ్బు తగ్గనప్పుడు ఇప్పుడు అందివచ్చిన అత్యాధునిక చికిత్స సదుపాయం ల్యాపరోస్కోపిక్ సర్జరీ/కీహోల్ సర్జరీ విధానం ద్వారా ఒకవేళ క్లోమగ్రంథి చెడిపోయి ఉంటే దాన్ని తొలగించవచ్చు. ఈ శస్త్రచికిత్స వల్ల రోగి హాస్పిటల్లో ఉండే వ్యవధి తగ్గడంతో త్వరగానే మీరు మీ సాధారణ వృత్తి వ్యాపకాలు కొనసాగించవచ్చు. -
నిద్రలేదు... అంతా చికాకు... ఏం చేయాలి?
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటివల నిద్ర సరిగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా సరిగా దృష్టి నిలపలేకపోతున్నాను. తగిన సలహా ఇవ్వగలరు. - కమలాకర్, బెంగళూరు మీరు చెప్పిన వివరాలను బట్టి మీరు ‘షిఫ్ట వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’తో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. అలారంలాగే మనం తినేవేళలు, నిద్రపోయే సమయాలు ఆ గడియారంలో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు. ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. ఇలాంటివారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. దాంతో పనుల్లో తప్పులు చేయడం, ఒక్కోసారి గాయపడటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరగడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల బారిన పడటం, గుండెజబ్బల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
‘డ్రైవర్స్ ఫెటీగ్’తో ప్రమాదాలు జరగవచ్చు!
స్లీప్ కౌన్సెలింగ్ నా భర్త కార్ డ్రైవర్. ఐటీ ఉద్యోగులను పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం వంటివి చేస్తుంటారు. నైట్‌షిఫ్ట్‌లు చేస్తుంటారు. ఉద్యోగపరంగా ఆయన నిద్ర వేళలు ఏమాత్రం క్రమబద్ధంగా ఉండవు. ఇటీవల చాలా త్వరగా సహనం కోల్పోతున్నారు. వెంటనే కోపం వచ్చేస్తుంది. డ్రైవింగ్ సమయంలో కునుకుపట్టి రెండు సార్లు యాక్సిడెంట్స్ చేయబోయారు. నా భర్త విషయంలో తగిన సలహా ఇవ్వగలరు. - విజయలక్ష్మి, రంగనాథపురం మీరు చెబుతున్న లక్షణాల ద్వారా మీ భర్త ‘డ్రైవర్స్ ఫెటీగ్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ఈ తీవ్రమైన సమస్య వల్లనే జరుగుతున్నాయి. నిద్రలేమి వల్ల మనం ఏదైనా సంఘటనకు ప్రతిస్పందించే వేగం తగ్గుతుంది. దాంతో అనుకున్నంత అప్రమత్తంగా ఉండలేము. ‘డ్రైవర్స్ ఫెటీగ్’ సమస్య వల్ల దృషి ్టకేంద్రీకరణ శక్తి కూడా తగ్గుతుంది. మెదడు ఎంత వేగంగా స్పందించాలనే విషయంలో ఆలస్యం జరగడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అయితే తాము డ్రైవింగ్‌ను కొనసాగించాలా లేదా ఆగి తగినంత విశ్రాంతి తీసుకోవాలా అన్న విషయం డ్రైవ్ చేసేవారికి తెలుస్తుంది. అయినా కొందరు అలాగే డ్రైవింగ్‌ను కొనసాగించి రిస్క్ తీసుకుంటుంటారు. ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు ఇవి: అదేపనిగా సుదీర్ఘంగా డ్రైవ్ చేస్తూనే ఉండటం అర్ధరాత్రి దాటాక 2 నుంచి 4 గంటల టైమ్‌లో డ్రైవ్ చేయడం మద్యం తీసుకొని డ్రైవింగ్ చేయడం తగినంత నిద్రపోకుండా వాహనం నడపడం మత్తు కలిగించే మందులు తీసుకొని డ్రైవ్ చేయడం నైట్‌షిఫ్టుల్లో డ్రైవింగ్... ఈ అన్ని సందర్భాల్లోనూ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాటిని నివారించడానికి... డ్రైవింగ్‌కు మీరు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉన్నారా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోండి అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరుగంటల వరకు డ్రైవింగ్‌కు దూరంగా ఉండండి. ఆ సమయంలో పరిస్థితులకు స్పందించే అప్రమత్తత కొరవడుతుంది రెండు ప్రయాణాలకు మధ్య తగనంత వ్యవధి ఉంచుకోండి డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కాస్త బ్రేక్ తీసుకోండి. డ్రైవ్ చేస్తున్నప్పుడు కునికిపాట్లు పడుతున్నట్లు అనిపిస్తే వాహనాన్ని సురక్షితమైన చోట ఆపి కాస్త కాఫీ తీసుకోండి లేదా కనీసం 15 నిమిషాల పాటు నిద్రపోండి డ్రైవ్ చేయాల్సి వచ్చేనప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆల్కహాల్ తీసుకోకండి జలుబు, ఫ్లూ, దగ్గు మందులు తీసుకున్నప్పుడు డ్రైవ్ చేయకండి. అవి కాస్త మత్తును కల్పిస్తాయి. మీ భర్త పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే డ్రైవర్స్ ఫేటీగ్ నుంచి దూరం కావచ్చు. ఆయనంతట ఆయన తన సమస్య అధిగమించలేకపోతే ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలవండి. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నేను క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నాను. క్రియాటినిన్ 6.4 ఎంజీ/డీఎల్. యూరియా 204 ఎంజీ/డీఎల్. నాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. డాక్టర్‌గారు ఏవీ ఫిస్టులా ప్రొసిజర్ ఆపరేషన్ చేయించుకొమ్మన్నారు. నాకు ఏ లక్షణాలూ కనిపించడం లేదు. అలాంటప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా? - దివాకర్, సంగారెడ్డి మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్-4లో ఉన్నారు. ఇప్పుడు ఏ లక్షణాలూ కనిపించనప్పటికీ మీకు భవిష్యత్తులో డయాలిసిస్ అవసరమవుతుంది. డయాలసిస్ ప్రక్రియలో నిముషానికి 200 మి.లీ. రక్తాన్ని బయటకు పంపించి, కృత్రిమ మూత్రపిండాల ద్వారా వడపోసి మళ్లీ శరీరంలోకి పంపుతారు.. చేతిపై ఉండే రక్తనాళాల ద్వారా ఇంత రక్తాన్ని వడపోయడం కష్టం. అందుకే ఏవీ ఫిస్టులా అంటే లోపలి పెద్ద రక్తనాళాన్ని పైన ఉండే చిన్న రక్తనాళానికి కలపడం. దీని ద్వారా శరీరంలో పైన ఉండే చిన్న రక్తనాళాల్లో సైతం రక్త ప్రవాహాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నెల నుండి రెండు నెలల తర్వాత చిన్న రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరుగుతుంది. అప్పుడు ఈ రక్తనాళాన్ని డయాలసిస్‌కు ఉపయోగించుకోవచ్చు. ఇది ముందే చేయించుకోవడం వల్ల హాస్పిటల్ ఇన్‌పేషెంట్‌గా చేరకుండానే ఔట్‌పేషెంట్‌గా డయాలసిస్ చేయంచుకోవచ్చు. పైగా ఎమర్జెన్సీ డయాలసిస్‌లో వాడే క్యాథెటర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్తో పాటు ఇతర దుష్ర్పభావాలను నివారించుకోవచ్చు. అందుకే ఈ ఏవీ ఫిస్టులా ఆపరేషన్ ముందే చేయించుకోవడం మంచిది. నా వయసు 22 ఏళ్లు. అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు కుడివైపు కిడ్నీ లేదని తెలిసింది. క్రియాటినిన్ 1.0 ఎంజీ/డీఎల్ ఉంది. యూరియా 28 ఎంజీ/డీఎల్ ఉంది. నాకు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - ప్రకాశరావు, గుంటూరు కొంతమందికి పుట్టుకతో ఒక కిడ్నీయే ఉంటుంది. అయితే వారిలో ఒక కిడ్నీయే ఉన్నప్పటికీ అది నార్మల్‌గా పనిచేస్తుంటే ఎలాంటి ఇబ్బందులూ రావు. ఒక కిడ్నీ ఉన్నవాళ్లల్లో కొంతమందికి మూత్రంలో ప్రొటీన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు (బీపీ) కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇలా ఉన్నట్లయితే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బ తినకుండా ఉండటానికి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. మూత్రంలో ప్రొటీన్ పోకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. నొప్పి నివారణ మందుల వంటి పెయిన్‌కిల్లర్స్ కిడ్నీకి హాని చేస్తాయి. కాబట్టి వాటితో పాటు కిడ్నీకి హాని కలిగించే మందులు వాడకూడదు. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా భార్యకు గర్భం వచ్చిన ఏడో వారంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించాం. ఆమెది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని, గర్భసంచిలో కాకుండా ప్రెగ్రెన్సీ కుడివైపు ఉండే ట్యూబ్‌లో వచ్చిందని డాక్టర్ చెప్పారు. అయితే గుండెచప్పుళ్లు వినిపిస్తున్నాయని అన్నారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలోనూ గుండె శబ్దాలు వినిపిస్తాయా? ఇప్పుడు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని చెబుతున్నారు. ఇది మందులతో తగ్గదా? గతంలోనూ ఒకసారి ఆమెకు గర్భం వచ్చినప్పుడు ఎడమవైపు ఇలాగే జరిగి, ఆ వైపు ఉన్న ట్యూబు తొలగించారు. ఇప్పుడు ఇలాగే జరిగితే భవిష్యత్తులో గర్భధారణ ఎలా జరుగుతుంది? దయచేసి వివరించండి. - ఆర్.కె., కొత్తగూడెం గర్భసంచిలో కాకుండా ట్యూబ్‌లోనే గర్భం ఉండే పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కండిషన్‌లోనూ గుండెచప్పుళ్లు వినిపిస్తుంటాయి. అలాగే మీరు చెప్పినట్లుగా ఈ పరిస్థితిని మందులతోనూ తగ్గించవచ్చు. అయితే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కుగా ఉన్నా లేదా గుండెచప్పుడు వినిపిస్తున్నా లేదా ప్రెగ్నెన్సీ హార్మోన్ (బీటా హెచ్‌సీజీ) ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్నా అప్పుడు మందులు వాడటం వల్ల ఫలితం తక్కువగా ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి అది అకస్మాత్తుగా కడుపులో రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోడానికి శస్త్రచికిత్సను డాక్టర్లు సూచిస్తుంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి లాపరోస్కోపిక్ సర్జరీ మంచి ప్రత్యామ్నాయం. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ట్యూబ్ ఉంచాలా లేదా అనే నిర్ణయాన్ని అప్పటి పరిస్థితిని బట్టి డాకర్లు తీసుకుంటారు. ఇక ఆమెకు అకస్మాత్తుగా రక్తస్రావం అయితే మాత్రం ఓపెన్ సర్జరీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ భార్య రక్తం గ్రూప్ నెగెటివ్ అయితే ఆమెకు ‘యాంటీ-డీ’ అనే ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమెకు రెండు ట్యూబులు తొలగించినా మీరు ఆందోళన చెందకండి. ఆమె సురక్షితంగా ఉండే ఆ తర్వాత టెస్ట్‌ట్యూబ్ బేబీ అని పిలిచే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) మార్గాన్ని అనుసరించవచ్చు.