slides
-
ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఢమాల్
సాక్షి, ముంబై: వీడియోకాన్ రుణవివాదంలో ఇరుక్కున్న ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు క్యూ 4 ఫలితాల్లో ఢమాల్ అంది. బ్యాడ్ లోన్ల బెడదతో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు నాలుగో త్రైమాసికంలో నికర లాభాలు సగానికి పడిపోయాయి. విశ్లేషకులు అంచనాలను అందుకోలేని బ్యాంకు క్యూ 4 నికర లాభం రూ. 1,020 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం రూ.2,025 కోట్లు. నెట్ వడ్డీ ఆదాయం సంవత్సరానికి 1 శాతం పెరిగి 6,022 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.24 శాతం పెరిగింది. గత త్రైమాసికంలోని 7.82 శాతంతో పోలీస్తే ఈక్వార్టర్లో మొత్తం రుణాలు 8.84శాతంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇది 7.89 శాతంగా నమోదైంది. సోమవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో బ్యాంకు వాటాదారులకు 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు 1.50రూపాయలుచొప్పున డివిడెండ్చెల్లించేందకు ప్రతిపాదించినట్టు వెల్లడించింది. ఆగస్టు 10న తుది నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఇది ఇలా ఉంటే వీడియోకాన్ వివాదం తరువాత మొదటిసారి ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్ ఫలితాల సందర్భంగా తొలిసారి మీడియాముందుకు వచ్చారు. ఈ వివాదంలో బోర్డు తనవైఖరిని వెల్లడించిందని,దర్యాప్తులో విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. -
మరింత బలహీన పడిన రూపాయి
సాక్షి, ముంబై: ముంబయి స్టాక్ మార్కెట్లో డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ మరింత బలహీన పడింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే ప్రారంభ సెషన్లో 0.12 రూపాయి విలువ 64.24 డాలర్లకు చేరుకుంది. అనంతరం మరిం బలహీనపడి కిందికి చేరింది. 0.20 పైసలు నష్టపోయి 64.25 వద్ద కొనసాగుతోంది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడంతో రూపాయి నష్టపోతోందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ .1,0010.07 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియోల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కాగా ఉత్తర కొరియా ఆందోళనలు జపనీయుల యెన్‌కు వ్యతిరేకంగా డాలర్ విలువ క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు పతనాన్ని నమోదు చేశాయి. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు మరింత పుంజుకున్నాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 20 ఎగిసి రూ. 30,245 వద్ద, వెండి కేజీ కేజీ రూ.50 లాభపడి రూ. 41,499 కు చేరింది.