మరింత బలహీన పడిన రూపాయి | Rupee slides further to 64.24 against USD; down 12 paise | Sakshi
Sakshi News home page

మరింత బలహీన పడిన రూపాయి

Published Wed, Sep 6 2017 9:57 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

మరింత  బలహీన పడిన రూపాయి

మరింత బలహీన పడిన రూపాయి

సాక్షి, ముంబై:   ముంబయి స్టాక్ మార్కెట్లో  డాలర్‌ మారకంలో  దేశీయ కరెన్సీ  మరింత బలహీన పడింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే  ప్రారంభ సెషన్లో 0.12 రూపాయి విలువ  64.24 డాలర్లకు చేరుకుంది.  అనంతరం మరిం బలహీనపడి  కిందికి చేరింది.  0.20 పైసలు నష్టపోయి 64.25 వద్ద కొనసాగుతోంది.

దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడంతో రూపాయి  నష్టపోతోందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు  రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ .1,0010.07 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియోల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

కాగా ఉత్తర కొరియా  ఆందోళనలు జపనీయుల యెన్‌కు  వ్యతిరేకంగా డాలర్‌ విలువ క్షీణించడంతో  ప్రపంచ  మార్కెట్లు పతనాన్ని నమోదు చేశాయి. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లో  ట్రేడ్‌ అవుతున్నాయి.   మరోవైపు  బంగారం ధరలు మరింత పుంజుకున్నాయి.  దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం   రూ. 20 ఎగిసి రూ. 30,245 వద్ద,   వెండి కేజీ  కేజీ రూ.50 లాభపడి రూ. 41,499 కు చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement