ముంబై: డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ శుక్రవారం 44 పైసలు క్షీణిం చింది. క్రితం ముగింపు 62.07తో పోలిస్తే 62.51 వద్ద ముగిసింది. సోమవారం వెల్లడికానున్న కరెంట్ ఖాతా లోటు గణాంకాల నేపథ్యంలో రూపాయి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నదని నిపుణులు విశ్లేషించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ బలహీనపడటంతో రూపాయి నష్టాలు పరిమితమయ్యాయని తెలిపారు. గత 2 రోజుల్లో రూపాయి విలువ 68 పైసలు పుంజుకున్న సంగతి తెలిసిందే.