నిమ్మకు మద్దతు ధర కల్పించాలి
నకిరేకల్ : నిమ్మ రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి సైదిరెడ్డి కోరారు. స్థానిక మార్కెట్ కార్యాలయంలో శనివారం నిమ్మ వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్‌లో త్వరలోనే నిమ్మ మార్కెట్ ఏర్పాటు కానుందన్నారు. ప్రస్తుతం నిమ్మ రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస మద్దతు ధర కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సిబ్బంది ఎస్.రమేష్, ఎం.వెంకట్‌రెడ్డి, కుమారి, మౌనిక, జగదీష్, నిమ్మ కాయల వ్యాపారులు మంగినపల్లి రాజు, బి.అంజయ్య, రామలింగం, నూక క్రాంతి, వెంకన్న, మట్టుపల్లి వీరేందర్, చెట్టుపల్లి సుధాకర్, నాగరాజు, జగన్, జోగు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.