కబేళాకు గోవుల తరలింపు
వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఫిర్యాదుతో కేసు
కరీంనగర్ గోశాలకు తరలింపు
చొప్పదండి : అనుమతి లేకుండా కబేళాకు తరలిస్తున్న పది ఆవులను మండల కేంద్రంలో మంగళవారం భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారమ ందించడంతో ఎస్ఐ రవీందర్ కేసు నమోదు చేశారు. వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో మంగళవారం జరిగిన పశువుల సంతలో ఐదు పెద్ద ఆవులు, ఐదు చిన్న ఆవులను కొని ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా చొప్పదండిలో భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులు అడ్డుకొని ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఎండీ మోయిన్ ఆవులను కబేళాకు తరిలిస్తున్నట్లు తెలుసుకున్న నాయకులు ఎస్ఐ రవీందర్‌కు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేసి అనంతరం వాటిని కరీంనగర్ గోసంరక్షణ శాలకు తరలించారు. గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందిగా ఆమలు చేయాలని వీహెచ్‌పీ మండల అధ్యక్షుడు పడకంటి క్రిష్ణ, గోరక్షక్ కాపర్తి మల్లికార్జున్, భజరంగ్‌దళ్ ప్రముఖ్ బత్తిని మురళీ, నలుమాచు రామక్రిష్ణ, పొన్నాల తిరుపతి, మావురం జగన్, సాయిగణేశ్, విజయ్, దుర్గా ప్రసాద్ కోరారు.