పాముకాటుతో మేకల కాపరి మృతి
తానూరు : మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన సంఘంవాడ్ యాదవ్(32) అనే మేకల కాపరి పాముకాటుతో శనివారం రాత్రి మతిచెందాడు. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం... మతుడు సంఘంవాడ్యాదవ్ శనివారం ఉదయం మేకలు తీసుకువెళ్లి గ్రామ సమీపంలో మేపుతున్నాడు. అంతలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ముథోల్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం రాత్రి నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.