చేతుల చర్మం పొడిబారిందా?
గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం వల్ల సబ్బుల్లోని రసాయనాలు చేతుల చర్మం పై ప్రభావాన్ని చూపుతాయి. వీటి వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంటుంటుంది. నిర్లక్ష్యం చేస్తే త్వరగా ముడతలు కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకూడదు అంటే.. పని పూర్తయిన తర్వాత లిక్విడ్ సోప్‌తో చేతులను శుభ్రపరుచుకుని, కొబ్బరి నూనెతో చేతులను మర్దనా చేసుకోవాలి. కొబ్బరి నూనెలోని మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరగదు.