Social Security Act
-
కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్!
గిగ్ ఉద్యోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో, అర్బన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర కార్మిక శాఖ ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కేంద్రం - సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చలు సఫలమైతే డెలివరీ బాయ్స్‌తో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ ఉద్యోగుల కష్టాలు గట్టెక్కనున్నాయి. దేశంలోని అనధికారిక కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించేలా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన ఈ నాలుగు లేబర్ చట్టాలపై ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. 2022 జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కార్మిక చట్టాలు ఉమ్మడి అంశం కాబట్టి కేంద్ర, రాష్ట్రాలు సంబంధిత నిబంధనల ఆధారంగా వాటిని అమలు కావాల్సి ఉంది. కానీ అవి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో గిగ్ ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో కేంద్రం..గిగ్ ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ వారికి బెన్ఫిట్స్ అందించే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 40శాతం మంది కార్మికులు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ - 2021 నివేదిక ప్రకారం, వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం 40శాతం మంది కార్మికులు ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారు. అయితే 20% కంటే తక్కువ మందికి యాక్సిడెంటల్ పాలసీ, నిరుద్యోగం, డిజేబిలిటీ ఇన్సూరెన్స్ (disability insurance), వృద్ధాప్య పెన్షన్లు లేదా పదవీ విరమణ ప్రయోజనాలు పొందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. గిగ్ వర్కర్లు అంటే ఎవరు? ఫలానా సమయానికి/ ఫలానా పని కోసం నియమితులయ్యే కార్మికులే గిగ్ వర్కర్లు. తమ పనిగంటలను ఎంపిక చేసుకునే సౌలభ్యం వీళ్లకు ఉంటుంది.నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం.. గిగ్ ఎకానమీ వర్కర్ల వాటా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది. వర్క్ ఫోర్స్‌లో 1. 3 శాతం కంటే ఎక్కువగా ఉంది. చదవండి👉 జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు! -
కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్
ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీల ప్రయోజనాల కోసమే పని చేస్తోందన్నారు. కార్మిక సంఘం పెట్టుకోవటానికి కొత్త నిబంధనలు విధించి కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. దేశం లో కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రోడ్డు రవాణా, భద్రత-2014’ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆటో, ట్రాలీ, మినీట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఈ-చలాన్ల బకాయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎ.నరేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు వెంకన్న, ప్రధాన కార్యదర్శి బాలనర్సింహ, సభ అధ్యక్ష వర్గం సభ్యులు కె.అశోక్, తెలంగాణ శ్రీను, ఎం.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సామాజిక భద్రత చట్టాన్నిఅమలు చేయాలి అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో రౌడ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ దేశంలో 96 శాతం మంది అసంఘటిత రంగంలో పని చేస్తున్నారని, వారికి ఎలాంటి రక్షణ, హక్కులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను ఐక్యం చేస్తేనే వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.వెంకట్ రెడ్డి, నాయకులు గోల్కొండ రత్నం, ఐ.మైసయ్య, కామేశ్వర్ రావు, ఆర్కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు.