టీసీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) 2016-18కు సంబంధించిన నూతన కార్యవర్గాన్ని క్వీన్స్టౌన్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన సొసైటీ సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బండ మాధవరెడ్డి, ఉపాధ్యక్షులుగా బూర్ల శ్రీనివాస్, పెద్ది చంద్రశేఖర్‌రెడ్డి, నీలం మహేందర్, ముద్దం అశోక్, గౌరవ కార్యదర్శిగా బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారిగా గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులుగా ఎల్లారెడ్డి, దుర్గాప్రసాద్, అలసాని కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పెద్దపల్లి వినయ్‌కుమార్, చెన్నోజ్వల ప్రవీణ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, చిల్క సురేశ్, గరెపల్లి శ్రీనివాస్, శివరాం ప్రసాద్, ఆర్సీ రెడ్డి, నల్ల భాస్కర్, పింగ్లి భరత్‌రెడ్డి, మిర్యాల సునీత, చెట్టిపల్లి మహేశ్, దామోదర్ గోపగోనిలు ఎన్నికయ్యారు. సింగపూర్‌లో ఉన్న ప్రవాస తెలంగాణ వాసులకు సేవలు అందిస్తామని సొసైటీ నూతన అధ్యక్షుడు మాధవరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.