somashekar
-
ఒక్క వార్డుకే టీజే‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్) మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటివరకు జరిగిన జిల్లా పరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని ఆ పార్టీ తాజాగా జరిగిన మున్సి‘పోల్స్’లోనూ పెద్దగా సీట్లు గెలుచుకోలేకపోయింది. తాండూరు మున్సిపాలిటీలో ఒకే ఒక్క వార్డును టీజేఎస్ గెలుచుకుంది. అక్కడి 34వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి సోమశేఖర్ గెలుపొందారు. -
సమ్మెకు సంఘీభావం
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే.. వారి సమస్యల పరిష్కారానికి సర్కారు చొరవచూపాలి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వికారాబాద్ : హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలియజేస్తున్నామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వికారాబాద్‌కు వచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తక్కువ జీతాలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేయడం న్యాయమైనదేనని ఆయన పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను సవరించుకోవడంపై ఆయన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని సూచించారు. కాగా.. ఆదివారం తాండూరు డిపోకు చెందిన బస్సుకు అడ్డు వెళ్లిన ఆర్టీసీ కార్మికుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా.. పోలీసులను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పరిస్థితి సద్దుమణిగింది. తాండూరులో బస్సులను అడ్డుకునేందుకు కార్మికుల యత్నం తాండూరు : ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా యూనియన్ నాయకులు, కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఆర్టీసీ సమ్మె ఐదో రోజు సందర్భంగా యూనియన్ నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఉదయం 9గంటలకు ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డిపో మేనేజర్ లక్ష్మీధర్మా వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికుల ప్రయత్నాలను విఫలం చేశారు. చించొళి, కరన్‌కోట్, కోస్గీ తదితర రూట్లలో నాలుగు బస్సులను అధికారులు నడిపించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ తాండూరు చైర్మన్ సోమశేఖర్‌తోపాటు నాయకులు ఆర్.విజయ్‌కుమార్, మదన్‌రెడ్డి, సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్ తదితరులు డిపో వద్దకు వచ్చి, సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సర్కారుకు సూచించారు. కార్మికుల సమ్మెకు అండగా ఉంటామన్నారు. సమ్మెలో భాగంగా యూనియన్ నాయకులు, కార్మికులు డిపో ఆవరణలో పాటలు పాడారు. కబడ్డీ ఆడారు. -
పథకం ప్రకారమే హత్య
మర్రిగూడ, న్యూస్‌లైన్: పథకం ప్రకారమే మర్రిగూడ మండల కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్టెల యాదయ్యను హత్య చేశారని దేవరకొండ డీఎస్సీ కేజే సోమశేఖర్ తెలిపారు. యాదయ్య హత్యకేసు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. మర్రిగూడ మండలంలోని అంతంపేటకు చెందిన గోడెట్టి రాములు, కట్టెల యాదయ్య స్నేహితులు. రాములు భార్యతో యాదయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గత నెల 29న ఆదే గ్రామానికి చెందిన ఐతరాజు హనుమంతు, దాసరి యాదయ్య, సురిగి ఎట్టయ్యతో కలిసి కట్టెల యాదయ్య హత్యకు పథకం పన్నారు. గత నెల 30న యాదయ్య తన చేలో పత్తి ఏరించడానికి కూలీల కోసం గొల్లవారి బజారుకు వెళ్లాడు. అక్కడ గుర్రపు సాయమ్మతో మాట్లాడుతుండగా రాములు వచ్చి యాదయ్యపై గొడ్డలితో దాడి చేశాడు. మెడపైన విచక్షణ రహితంగా నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రాములు ఆదివారం మర్రి గూడ నుంచి యరగండ్లపల్లికి వెళ్తుండగా సమాచారం అందుకు న్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాములుతో పాటు పాటు హత్యకు పథకం పన్నిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. అలాగే హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ శివరాంరెడ్డి, మర్రిగూడ, నాంపల్లి, గుర్రంపోడ్, చింతపల్లి ఎస్సైలు శంకర్‌రెడ్డి, బీషన్న, గౌరినాయుడు, ధనంజయ, ఐడీ పార్టీ సిబ్బంది ఖలీల్, నారాయణ, ఖదీర్, యాదయ్యలను డీఎస్పీ అభినందించారు.