మర్రిగూడ, న్యూస్‌లైన్: పథకం ప్రకారమే మర్రిగూడ మండల కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్టెల యాదయ్యను హత్య చేశారని దేవరకొండ డీఎస్సీ కేజే సోమశేఖర్ తెలిపారు. యాదయ్య హత్యకేసు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
మర్రిగూడ మండలంలోని అంతంపేటకు చెందిన గోడెట్టి రాములు, కట్టెల యాదయ్య స్నేహితులు. రాములు భార్యతో యాదయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గత నెల 29న ఆదే గ్రామానికి చెందిన ఐతరాజు హనుమంతు, దాసరి యాదయ్య, సురిగి ఎట్టయ్యతో కలిసి కట్టెల యాదయ్య హత్యకు పథకం పన్నారు.
గత నెల 30న యాదయ్య తన చేలో పత్తి ఏరించడానికి కూలీల కోసం గొల్లవారి బజారుకు వెళ్లాడు. అక్కడ గుర్రపు సాయమ్మతో మాట్లాడుతుండగా రాములు వచ్చి యాదయ్యపై గొడ్డలితో దాడి చేశాడు. మెడపైన విచక్షణ రహితంగా నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రాములు ఆదివారం మర్రి గూడ నుంచి యరగండ్లపల్లికి వెళ్తుండగా సమాచారం అందుకు న్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
రాములుతో పాటు పాటు హత్యకు పథకం పన్నిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. అలాగే హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ శివరాంరెడ్డి, మర్రిగూడ, నాంపల్లి, గుర్రంపోడ్, చింతపల్లి ఎస్సైలు శంకర్‌రెడ్డి, బీషన్న, గౌరినాయుడు, ధనంజయ, ఐడీ పార్టీ సిబ్బంది ఖలీల్, నారాయణ, ఖదీర్, యాదయ్యలను డీఎస్పీ అభినందించారు.