పుష్కర ఘాట్లో వింత!
తెలకపల్లి: కృష్ణా పుష్కరాలు చివరిరోజైన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పుష్కరఘాట్లో వింత చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన చిన్నారికి పుణ్యస్నానం చేయిస్తుండగా.. ఆమెకు మూడు చేతులు ఉన్నట్లు కనిపించాయి. దీనిని భక్తులు కృష్ణమ్మ మహత్యమేనని చర్చించుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు రెడ్డెపాకుల కృష్ణయ్య తన కుటుంబ సభ్యులతో మంగళవారం సోమశిల పుష్కర ఘాట్లోకి వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. కృష్ణయ్య తన కూతురు ప్రయాగకు (11నెలలు) ఘాట్లో స్నానం చేయిస్తుండగా బయట ఉన్న బంధువులు ఫొటోలు తీశారు. అయితే ఫొటోల్లో పాపకు రెండు చేతుల బదులు మూడు చేతులు కనిపించాయి. ఈ వింతను చూసేందుకు భక్తులు ఆసక్తిచూపారు.