వేగేశ్వరపురంలో బయల్పడిన పురాతన నాణేలు
తాళ్లపూడి :మండలంలోని వేగేశ్వరపురం ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం క్రింది భాగంలో అతి పురాతనమైన బ్రిటీష్ కాలం నాటి నాణేలు బయట పడ్డాయి. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ నాణేలు బయటపడగా జాగ్రత్తగా సేకరించారు. 1832 నుంచి 1910 మధ్య కాలానికి చెందిన వెండి, రాగి, ఇత్తడి నాణేలుగా వీటిని స్థానికులు గుర్తించారు. బ్రిటీష్ వారి హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ముద్రించినవిగా తెలుస్తున్నాయి. కింగ్ జార్జి, క్వీన్ విక్టోరియా, ఎడ్వర్డ్ చిత్రాలు వీటిపై ముద్రించి ఉన్నాయి. నాణేలపై ఒన్ క్వార్టర్ రూపి, ఒన్ ఫోర్త్ రూపీ అని కూడా ముద్రించి ఉంది. వీటిని మళ్లీ ధ్వజస్తంభం కింద వేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు.