sommanna arrest
-
నయీం కేసులో మరొకరి అరెస్ట్
-
నయీం కేసులో మరొకరి అరెస్ట్
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరొకరిని సిట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈసీఐఎల్లో ద్వారకా నగర్లో సోమన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనును పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో పలువురు వ్యాపారులను కూడా సిట్ ప్రశ్నించింది.