'జపాన్ సంస్థలతో ఒప్పందం విరమించుకోకుంటే తీవ్ర ఉద్యమం'
శ్రీకాకుళం: జిల్లాలోని సోంపేట మండలం బారువా వద్ద పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి జపాన్ సంస్థలతో ఒప్పందంపై వారు నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2,640 మెగావాట్ల నాగార్జున కన్స్ట్రక్షన్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను చంద్రబాబు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, ఇప్పుడు కొత్తగా జపాన్ సంస్థలతో మరో థర్మల్ పవర్‌ప్లాంట్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారని ఉద్యమ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సాయిరాజు విమర్శించారు. జపాన్ సంస్థలతో ఒప్పందం విరమించుకోకుంటే తీవ్ర ఉద్యమం చేపడుతామని సాయిరాజు హెచ్చరించారు.