బాధల నుంచి విముక్తి...
శనీశ్వరుడు బాధలకు గురిచేసే దైవం కాదు... బాధల నుంచి విముక్తిని కలిగించే దైవం అని తెలిపే కథాంశంతో రూపొందిన భక్తిరస చిత్రం ‘శనిదేవుడు’. సుమన్, ఆకాశ్, శివ జొన్నలగడ్డ ముఖ్యతారలుగా స్వీయ దర్శకత్వంలో జొన్నలగడ్డ శివ నిర్మించిన ఈ చిత్రం నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శివ మాట్లాడుతూ- ‘‘తెలుగులో శనీశ్వరుని చరిత్ర నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇది. శనిదేవుని గొప్పతనమేంటో ఈ కథ తెలియజేస్తుంది’’ అని తెలిపారు.