రెండో రౌండ్లో సానియా జోడి
మియామి: సోనీ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి రెండో రౌండ్లోకి ప్రవేశించింది.
తొలి రౌండ్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 6-3, 6-7 (8/10), 10-8 తేడాతో హావో చింగ్ చాన్-యంగ్ జన్ చన్ (చైనీస్ తైపీ) జోడిని ఓడించింది. ఇదే వేదికపై జరుగుతోన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీ డబుల్స్ తొలి రౌండ్లో పేస్ (భారత్)- స్టెపానెక్ (చెక్) జంట 3-6, 6-7 (7/9)తో బుటొరాక్- క్లాసెన్ (అమెరికా) జోడి చేతిలో ఓడింది.