సమాజంలో మహిళల పాత్ర కీలకం
పర్వతగిరి : సమాజంలో మహిళల పాత్ర కీలకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం జరిగిన మదర్ థెరిసా పరస్పర సహకార పరపతి సంఘం, మార్కెటింగ్ మండల సమాఖ్య సంఘం పదో వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. మండలంలో మొత్తం 967 మహిళా సంఘాలు ఆర్థికంగా మందుకుసాగటం అభినందనీయమన్నారు. ఏనుగల్లు గ్రామంలో గ్రామైక్య సంఘం భవనాన్ని రూ.40 లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. మరో రూ.40లక్షలతో గ్రామానికొకటి చొప్పున వీఓ భవనాలను నిర్మించి బలహీన వర్గాలకు మినీ ఫంక్షన్‌హాల్‌గా కానుకగా ఇవ్వనున్నట్లు చెప్పారు. వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని సీఎంను కోరినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు వీఓలు ‘మన బడి మన బాధ్యత’ కార్యక్రమానికి రూ.25 వేల చెక్కు అందజేశారు. ఎంపీపీ రంగు రజిత, జడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజ, సర్పంచ్‌లు గోనె విజయలక్ష్మి, వంగాల సంధ్యారాణి, ఎంపీటీసీ సభ్యులు పట్టాపురం తిరుమల, ఈరగాని రాధిక, ఎంపీడీఓ కృష్ణయ్య, తహసీల్దార్ సత్యనారాయణ, ఏపీఎం అశోక్, ఏరియా కోఆర్డినేటర్ దయాకర్, ఐఓబీ బ్యాంక్ మేనేజర్ భానుచందర్, మదర్‌థెరిస్సా సంఘం అధ్యక్షురాలు సుజాత, గ్రామైక్య సంఘాల అధ్యక్షులు, వీఓలు, మహిళలు పాల్గొన్నారు.