భారత హాకీ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యెండల సౌందర్య భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికైంది. జపాన్‌లో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ టోర్నీ కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరుగుతుంది. ఇందులో భారత్‌తో పాటు చైనా, జపాన్, మలేసియాలు తలపడుతున్నాయి. మిడ్‌ఫీల్డర్ రీతూ రాణి జట్టుకు సారథ్యం వహించనుంది. గత నెల మలేసియాలో జరిగిన ఆసియా కప్‌లో భారత్ రజత పతకం గెలిచింది.
జట్టు: రీతూ రాణి (కెప్టెన్), యెండల సౌందర్య, నమిత, చంచన్ దేవి, వందన, రాణి, పూనమ్ రాణి, రితుష్య ఆర్య, దీప్గ్రేస్ ఏక్కా, దీపిక, కిరణ్‌దీప్ కౌర్, సునీత లక్రా, సుశీల చాను, మోనిక, మంజీత్ కౌర్, అమన్‌దీప్, సానరిక్ చాను, సందీప్ కౌర్, లిలీ మింజ్, లిలీ చాను, అనురాధా దేవి, అనూప బార్లా.