బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి సౌత్ ఇండస్ట్రీకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్
హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) బాలీవుడ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడు. హిందీ చిత్ర పరిశ్రమను వీడుతున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. హిందీ ఇండస్ట్రీ చాలా విషపూరితంగా మారిపోయిందని ఆయన అసహనం వ్యక్తంచేశాడు. ఇక్కడ మేకర్స్ ఆలోచనలు చూసి పిచ్చెక్కుతోందని, ముంబైని వదిలేసి సౌత్ ఇండస్ట్రీలో సెటిలైపోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దక్షిణాది చిత్రపరిశ్రమ(South Industry)ని చూసి అసూయ చెందుతున్నానని, సౌత్ ఇండస్ట్రీలాగా ఇక్కడ (బాలీవుడ్లో) ప్రయోగాలు చేయడం కష్టమని ఆయన చెప్పాడు.బాలీవుడ్‌ను వదిలేసిన అనురాగ్ కశ్యప్ తాజాగా బెంగళూరుకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పాడు. 'నేను బాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొనే ఇక్కడకు (బెంగళూరు) వచ్చాను. బాలీవుడ్ చిత్రపరిశ్రమ చాలా దారుణంగా తయారైంది. సినిమా ప్రారంభం నుంచీ వ్యాపారం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలా అమ్ముదాం, మనకెంతొస్తుంది..? ఇదే చర్చ.. దీనివల్ల సినిమా తీసేటప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను. హిందీలో ప్రతిఒక్కరూ సాధ్యం కాని టార్గెట్లతో సినిమాను ప్రారంభిస్తున్నారు. రూ.500 కోట్లు, రూ.800 కోట్లు వచ్చే సినిమాలను మాత్రమే తీయాలని ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు. దీంతో అక్కడ ప్రతిభ, కొత్తదనానికి ఛాన్స్ లేకుండా పోయింది.' అని ఆయన తెలిపాడు. ఇక నుంచి తాను పూర్తిగా సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లోనే ఉంటానని ఆయన చెప్పాడు.అనురాగ్ చివరగా రైఫిల్ క్లబ్, విడుదలై 2 సినిమాల్లో నటించాడు. ఇప్పటివరకు దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో మొట్ట మొదటి చిత్రం పాంచ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. రెండు దశాబ్దాల తర్వాత పాంచ్‌ను ఎట్టకేలకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది పాంచ్ ప్రేక్షకుల ముందుకురావచ్చు. ప్రస్తుతం ‘డకాయిట్’లో ఆయన నటిస్తున్నాడు. అడివిశేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.