space ticket
-
వారం రోజుల అంతరిక్ష టూర్.. ఒక్కొక్కరు ఎన్ని కోట్లు చెల్లించారంటే?
కేప్ కార్న్‌వాల్: వారం రోజులు అంతరిక్షంలో నివసించేందుకు ముగ్గురు బడా వ్యాపారవేత్తలను, వారి రక్షక ఆస్ట్రోనాట్‌ను శుక్రవారం స్పేస్ఎక్స్ కంపెనీ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు పంపింది. ఐఎస్ఎస్కు స్పేస్ఎక్స్ తొలి ప్రైవేట్ ప్రయాణం ఇదే కావడం విశేషం. శనివారం ఈ ముగ్గురూ ఐఎస్ఎస్లోకి చేరుకున్నారు. రాకెట్ ప్రయాణానికి, అంతరిక్షంలో విడిదికి వీరు ఒక్కొక్కరు దాదాపు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 418 కోట్లు) చెల్లించారు. వీరు ఐఎస్ఎస్లో రష్యా సొంతమైన ప్రాంతం తప్ప ఇతర ప్రాంతాలన్నీ చూడవచ్చు. అమెరికాకు చెందిన లారీ కానర్, కెనెడాకు చెందిన మార్క్ పాతీ, ఇజ్రాయిల్‌కు చెందిన ఈటాన్ స్టిబ్బె ఈ టికెట్లను కొనుగోలు చేశారు. వీరికి రక్షణగా సీనియర్ ఆస్ట్రోనాట్ మైకెల్ లోపెజ్ వెళ్లారు. ఇప్పటికే రష్యా, అమెరికా దేశాల స్పేస్ ఏజెన్సీలు అంతరిక్ష టూర్లను నిర్వహిస్తున్నాయి. తాజా ప్రయాణంతో వీటి సరసకు స్పేస్ఎక్స్ చేరింది. జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూఆరిజిన్ కంపెనీ అంతరిక్షం అంచులకు ప్రైవేట్ యాత్రలు నిర్వహిస్తోంది.త్వరలో వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ సైతం ఈ యాత్రలు నిర్వహించనుంది. చదవండి: (కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి) -
‘స్పేస్ టికెట్’ వివాదం కేసులో ఓడిన భర్త
లండన్: ‘స్పేస్ టికెట్’వివాదంతో కోర్టుకెక్కిన భారత సంతతికి చెందిన ఓ జంట విడాకుల కేసులో భర్త ఆశిష్ ఠక్కర్ ఓడిపోయారు. ఆశిష్ తన భార్య మీరా మానెక్‌కి తగిన భరణాన్ని ఇవ్వాల్సిందేనని ఇంగ్లండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. తనకు రావాల్సిన భరణం చెల్లించకుండా ఉండేందుకు తన భర్త ఆశిష్ ఆస్తులను తక్కువగా చేసి చూపిస్తున్నారని మీరా బ్రిటన్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 2008లో వివాహం చేసుకున్న వీళ్లు 2013లో విడిపోయారు. ఆశిష్ బిలియనీర్ అని, తన ఆస్తిని కేవలం 4.45 లక్షల పౌండ్లుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆశిష్ 1.6 లక్షల పౌండ్లతో వర్జీనియా గలాక్టివ్ పేరుతో స్పేస్ టికెట్‌ను కూడా కొనుగోలు చేశారని, ఈ ధరను తన ఆస్తిలో కలపలేదని కోర్టుకు తెలిపింది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. కాగా, మారా గ్రూపు ఆశిష్‌కి సంబంధించింది కాదని ఆశిష్ తరఫున అతని తండ్రి, సోదరి హైకోర్టుకు నివేదించగా.. ఈ వాదనలను తోసిపుచ్చింది. -
స్పేస్ టికెట్‌పై బ్రిటన్ హైకోర్టుకు ఈడ్చిన మాజీ భార్య
లండన్: భారత సంతతికి చెందిన ఆశిష్ ఠక్కర్‌ను ఆయన మాజీ భార్య మీరా మానెక్ బ్రిటన్ హైకోర్టుకు ఈడ్చింది. విడాకుల నేపథ్యంలో ఆమె రావాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఆస్తులు తక్కువగా చూపిస్తున్నాడంటూ ఆమె కోర్టు మెట్లెక్కింది. ఇంతకీ అతడు లెక్క చూపించని ఆస్తి ఏమిటో తెలుసా.. అంతరిక్ష యాత్రకు సంబంధించిన టికెట్. దానికోసం కోర్టుదాకా వెళ్లాల అనుకోకండి. ఎందుకంటే దాని విలువ ఏకంగా లక్షా అరవైవేల పౌండ్లు. దీనిని కూడా అతడి ఆస్తిగానే పేర్కొంటే అందులో కనీసం 30శాతం ఆమెకు భరణంగా వస్తుంది. దీనిపై ఒక వారం రోజులపాటు సోమవారం నుంచి బ్రిటన్ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆశిష్ ఠక్కర్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త. ఆయన బ్రిటన్‌లోని లైసిస్టర్లో మారా గ్రూప్ నడిపిస్తున్నాడు. బ్రిటన్‌కు వలస వచ్చిన తూర్పు ఆఫ్రికా భారతీయుల కుటుంబాల్లో ఆశిష్ కుటుంబం కూడా ఒకటి. 1970 కాలంలో ఉగాండన్ నియంత ఇది అమిన్ 1970లో వారిని తూర్పు ఆఫ్రికా భారతీయ కుటుంబాలను వెళ్లగొట్టినప్పుడు వారు బ్రిటన్‌కు వచ్చారు. ఆ తర్వాత మీరా మానెక్ను 2008లో వివాహం చేసుకున్నాడు. అయితే, ఐదేళ్లకే వారి వివాహంలో వేరు కుంపట్లు వచ్చాయి. 2013లో విడిపోయారు. వీరు కలిసి ఉన్న సమయంలోనే వర్జిన్ గెలాస్టిక్ సంస్థ భవిష్యత్‌లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకోసం తొలిసారి వీరు టికెట్ కొనుగోలు చేశారు. లక్షా 60 వేల పౌండ్లు పెట్టి ఆ టికెట్ కొన్న తొలి భారత సంతతి పౌరులు కూడా వీరే. అయితే, అనూహ్యంగా వారిద్దరు విడిపోవడం, తన ఆస్తిలో కొంతమొత్తం భార్యకు భరణంగా చెల్లించాల్సి వచ్చే పరిస్థితులు తలెత్తాయి. అయితే, తన ఆస్తులు మొత్తం కూడా 4,45,532 పౌండ్లుగా మాత్రమే ఆశిష్ పేర్కొన్నాడు. స్పేస్ టూర్ టికెట్ ఖర్చును అందులో పేర్కొనలేదు. దీంతో దానిని కూడా అతడి ఆస్తిగానే పరిగణించి అందులో నుంచి కూడా తనకు భరణంగా ఇవ్వాల్సిందేనని మీరా మానెక్ డిమాండ్ చేస్తోంది. ప్రయాణం మొదలయ్యేనాటికి టికెట్ రద్దు చేసుకున్నా సదరు సంస్థ స్పేస్ టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది.