పంచారామాలకు ప్రత్యేక బస్సులు
రావులపాలెం: కార్తీక మాసం సందర్భంగా రావులపాలెం డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ జి.కామరాజు సోమవారం తెలిపారు. ఈ నెల 26, వచ్చే నెల 2, 9,16 తేదీల్లో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు రావులపాలెం నుంచి ఈ సర్వీసులు బయలుదేరుతాయన్నారు. పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఐదు శైవ కేత్రాలను సోమవారం రోజున దర్శింపజేస్తామన్నారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడితే ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డీలక్స్‌లో పెద్దలకు రూ.665, పిల్లలకు రూ.515, ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకు రూ.590, పిల్లలకు రూ.515 చార్జీలతో రిజర్వేషన్ చేయించుకోవచ్చునన్నారు. వివరాలకు 08855 255388, 99592 25549 నంబర్లకు సంప్రదించాలన్నారు.