Special Stories On Telugu Actors Roles
-
ఒకే ఒక్క సినిమా.. విలనిజంతో భయపెట్టిన హీరోయిన్లు
హీరోయిన్గా కెరీర్‌ని ప్లాన్ చేసుకోవడం ఎంత కష్టమో… కంటిన్యూ చేయడం కూడా అంతే కష్టం. అందులోనూ అసలు హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లు. అంతకు మించి కష్టం. ఇలా అన్ని వైపుల నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కెరీర్ అది. అలాంటిది…ఇంకా హీరో యిన్‌గా కంటిన్యూ అవుతూనే విలనిజం వైపు ఒక లుక్ వేయడం అంటే చిన్న విషయం కాదు. సాహసమనే చెప్పాలి. ఇలాంటి సాహసాలు చేసి శభాష్ అనిపించుకునే తారమణులూ ఉన్నారు. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్నపేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భుతంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీ… నరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. ఫుల్ నెగిటివ్ రోల్ క్యారెక్టర్ అది. పైగా రజినీకాంత్‌తో ఢీ అంటే ఢీ అనే పాత్ర. ఆ క్యారెక్టర్లో రమ్యకృష్ణ జీవించింది. నరసింహ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఆ సక్సెస్‌లో రజినీకాంత్‌తో సమాన వాటా రమ్యకృష్ణది కూడా. నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది తన నటనతో. చాలా కాలం పాటు ఆ పేరు బ్రాండ్‌గా నిలిచింది. టాలీవుడ్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన అతి తక్కువ హీరోయిన్స్‌లో సౌందర్య ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సౌందర్య నటించింది. అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సౌందర్య. హీరోయిన్గా కెరీర్ కొనసాగు తున్న సమయంలోనే… నెగిటివ్ రోల్ ప్లే చేసింది సౌందర్య. నా మనసిస్తా రా చిత్రంలో శ్రీకాంత్ , రిచా హీరో, హీరోయిన్లుగా నటిస్తే…విలన్‌గా సౌందర్య యాక్ట్ చేసింది. నెగిటివ్ రోల్ లోనూ మంచి మార్కులను కొట్టేసింది. మహేశ్ బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. గోపిచంద్‌తో పాటుగా ఉంటూ అతను చేసే ప్రతి పనికి సహకరిస్తూ ఉంటుంది రాశి. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కు క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. -
వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్
సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ? హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది. సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. (చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం) సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్‌తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్ అని ఆ మధ్య తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. (చదవండి: హీరోయినే..హీరో) వైజాగ్‌లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. సమంత హిట్స్ లిస్ట్‌పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి. లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్‌లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్ బుక్‌లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్‌గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్‌తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు. -
Tollywood Actresses: వెండితెరపై నారీమణుల విశ్వరూపం
సినిమాని తీసే తీరులో మార్పొచ్చింది. చూసే విధానంలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. బడ్జెట్ పెరిగింది. క్రియేటివిటీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. కానీ హీరోయిన్ని గ్లామర్ డాల్‌గా చూసే పద్ధతిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ దొరుకుతుంది. అప్పుడు వాళ్లు తమ విశ్వరూపం చూపిస్తే దశాబ్దాల పాటు ఆ నటనని ప్రేక్షకులు గుర్తు చేసుకుని మరీ ఆనందిస్తారు. అభినందిస్తారు. ఫెర్ఫా మెన్స్ స్కో ప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే అదరహో అనేలా ఆ పాత్రకి జీవం పోసిన హీరోయిన్స్‌ని ఒకసారి చూసేద్దామా? అందం అభినయం. ఇవి రెండు కలిస్తే శ్రీదేవే. గ్లామర్ యాంగిల్లో శ్రీదేవికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో యాక్టింగ్ పరంగా అంతకు మించిన పేరుంది. అయినానిజానికి నటనపరంగా తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం చాలా సినిమాల్లో శ్రీదేవికి లభించింది. అయితే... వసంత కోకిల చిత్రంలో పోషించిన విజయ పాత్ర శ్రీదేవి నటజీవితంలోనే మైలు రాయి. ఆరు ఏళ్ల వయ స్సు పిల్ల మైండ్‌లో ఉన్న ఇరవై ఏళ్ల యువతిగా అద్భుతంగా నటించింది శ్రీదేవి. హోమ్లీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటి సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ కథానాయికల్లో సౌందర్య ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చాలా పాత్రల్లో సౌందర్య నటించారు. కానీ అంతఃపురంలో భానుమతి క్యారెక్టర్ మాత్రం నిజంగానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. కానీ అక్కడ ఉన్నది సౌందర్య. ఇక చెప్పేదేముంది వెండితెర మీద విశ్వరూపమే చూపించింది. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్న పేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భు తంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీనరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. గర్వం, పొగరు ఉన్న జమీందారు కూతురు పాత్రలో జీవించేసింది రమ్యకృష్ణ. తనదైన నటనతో నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది. ఛాలెంజింగ్ పాత్రల గురించి చెప్పుకునేటప్పుడు మంచు లక్ష్మీ పేరుని మిస్ అవడానికి వీల్లేదు కదా. గుండెల్లో గోదారి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాల్లో మంచు లక్ష్మీ పెర్ఫామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. గుండెల్లో గోదారి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. గోదావరి యాసలో డైలాగ్‌ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో ముసలమ్మగా డీగ్లామరైజ్ రోల్ బాగా యాక్ట్ చేసింది. చదవండి: నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో -
నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో
ఐదేళ్ల కెరీర్. బానే ఉన్నట్టు. పదేళ్లు. అబ్బో కేక. చాలా పెద్ద హీరోయిన్. ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాని ఏలేసింది అంటారు. అదే హీరోలకైతే పదేళ్లు అన్నది చాలా తక్కువ టైమ్. వాళ్లకి 60 దాటినా హీరోలే. సో విషయం ఏంటంటే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇలా వచ్చారు. అలా వెళ్లిపోయారు అన్నట్టుగా ఉంటుంది. ఈ టైమ్‌లో వాళ్లు పోషించే ఛాలెంజింగ్ పాత్రలే ఆ తర్వాత కూడా వాళ్ల గురించి మాట్లాడుకునేలా చేస్తాయి. లేదా వాళ్ల లైఫ్ స్పాన్స్ని పెంచుతాయి. లేడి ఓరియంటెడ్ సినిమాలే తెలుగులో తక్కువ. అందులో ఒక గ్లామర్ హీరోయిన్ ఏకంగా లేడి అమితాబ్ అన్న బిరుదును దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. విజయశాంతికి అది ఎందుకు సాధ్యమైందంటే తను అసామాన్యురాలు కాబట్టి. ఒకటి కాదు. రెండు కాదు. తానే ముందుండి నడిపించిన సినిమాల లిస్ట్ ఒసేయ్ రాములమ్మ దాకా చాలా పెద్దదే ఉంది. అయితే వీటన్నింటికీ పునాది మాత్రం కర్తవ్యం సినిమానే. అందులో పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి పెర్ఫామెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సావిత్రి బయోపిక్ తీస్తున్నారు. కీర్తిసురేష్ సావిత్రిగా చేస్తుందన్న వార్త బయటకు రాగానే రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. సావిత్రిని మరిపించేలా కీర్తి సురేష్ నటించగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తమైయ్యాయి. కానీసావిత్రి పాత్రలో పరాకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్. సావిత్రి జీవితంలోని ప్రతి దశను అద్భుతంగా వెండి తెర మీద ఆవిష్కరించింది. శివపుత్రుడు చిత్రంలో గోమతి క్యారెక్టర్‌తో అందరినీ ఆశ్చర్యపర్చింది సంగీత. అందులో గంజాయి అమ్మే యువతి పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించింది. ఆ పాత్రలో జీవించింది. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత 2002లో ఖడ్గంతో హిట్ అందుకుంది సంగీత. ఆ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిలిమ్‌ఫేర్ అవార్డు తెలుగు అందుకుంది. ఆ వెంటనే పితామగన్ చిత్రంలో గంజాయి అమ్మే పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్లామర్ పాత్రలతో ఇల్లు చక్కపెట్టుకోవాల్సిన టైమ్‌లో ఇలాంటి రోల్స్ అవసరమా అని సలహాలు కూడా ఇచ్చారట. కానీ డైరెక్టర్ బాలా మీద నమ్మకంతో డేట్స్ ఇచ్చేసింది సంగీత. హీరోయిన్ అంటే గ్లామర్ రోల్. అంతే అని ఇండస్ట్రీ అంతా ఫిక్స్ అయిన టైమ్ సోలో గా కథలను లీడ్ చేసే ప్రతిభను ప్రదర్శించిఅవకాశాలనూ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ తొలి నుంచి సమంతకి దక్కు తూనే ఉన్నాయి. ఏమాయ చేశావే, రంగస్థలం, ఓ బేబీఇలా చాలా సినిమాల్లో నటిగా తన సత్తాని చాటింది. ఛాలెంజింగ్ రోల్స్ గురించి ప్రస్తావించాలంటే అనుష్క గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి. కేవలం గ్లామర్ డాల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. అయితే అనుష్కలోని ప్రత్యేకత ఏంటంటే ఒక మూస లోనే ఉండకపోవడం. అరుంధతి విడుదలైన తర్వాత ఇక అనుష్కకి గ్లామర్ పాత్రలు పెద్దగా రావంటూ చాలా విశ్లేషణలు వచ్చాయి. కానీ ఆ అంచనాలను తప్పని నిరూపించింది. అటు గ్లామర్ రోల్స్, అటు ఛాలెంజింగ్ రోల్స్ అదరగొట్టింది. విభిన్నమైన పాత్రలు చేయాలని సహజంగానే ఎవరికైనా ఉంటుంది. కానీ దాని కోసం కెరీర్‌ని రిస్‌లో పెట్టడానికి కూడా వెనుకాడని వాళ్లు అతి అరుదుగా ఉంటారు. నటన పై వారికున్న గౌరవానికి అతి ప్రతీక. స్వీటి ఆ కోవలోకే వస్తుంది. అసలు హీరోయిన్ అంటేనేగ్లామర్. కేవలం ఒక పాత్ర కోసం బరువు పెరగడం అంటే కెరీర్ చుట్టూ క్వశ్చన్ మార్క్‌లు పెట్టుకోవడమే. ఆ సాహసాన్ని అనుష్క చేసింది. సైజ్ జీరో సినిమా కోసం 17 కేజీలు బరువు పెరిగింది.