స్పెల్‌బీ అమోఘం
‘సాక్షి’ ప్రయత్నం అభినందనీయం..
స్పెల్‌బీ కార్యక్రమాన్ని కొనియాడిన
స్కూల్ యాజమాన్యాలు
సిటీబ్యూరో: పిల్లల్లో ఆంగ్లభాషలో పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘స్పెల్‌బి-2014’ కార్యక్రమం అభినందనీయమని పలు పాఠశాలల యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆత్యధిక పతకాలు సాధించిన స్కూళ్లకు చాంపియన్ ట్రోఫీలను సాక్షి గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్ డెరైక ్టర్ ైవె ఈపీ రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెడ్ విద్య, ఏపీలోని రాజమండ్రికి చెందిన ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ డీన్ హర్షిణిదేవి, చిత్తూరుకు చెందిన కమ్ఫార్డ్ స్కూల్ కరస్పాండెంట్ సీఆర్ మహేష్ చాంపియన్‌షిప్ ట్రోఫీలను అందుకున్నారు.
పిల్లల మేథోశక్తిని పెంచే ందుకు సాక్షి చేపట్టిన కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని వారు అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని వారు ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా నాలుగు కేటగిరిలలో నిర్వహించిన పోటీల్లో దాదాపు 160 మంది ఫైనల్స్‌కు ఎంపిక కాగా ఒక్కో కేటగిరి నుంచి ముగ్గురు చొప్పున 25 మంది పతకాలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలలో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ 5 పతకాలు, ప్యూచర్ కిడ్స్ 2, కమ్ఫార్డ్ 2 పతకాలను కైవసం చేసుకున్న విషయం విదితమే.