16న కేజీబీవీ స్పెషలాఫీసర్ల పరీక్ష ఫలితాలు
విద్యారణ్యపురి : జిల్లాలోని కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఐదు స్పెషల్ ఆఫీసర్ల పోస్టులకు జూలై 29 న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను ఈనెల 16న వెల్లడించనున్నట్లు ఏజేసీ, సర్వశిక్షాభియాన్ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ తిరుపతిరావు వెల్లడించారు. ఐదు పోస్టులు భర్తీ చేయనుండగా, రెండింటిని దృష్టి లోపం, మూగచెవిటి అభ్యర్థినులకు కేటాయిం చారన్నారు. ఉత్తీర్ణుల్లో మూగ, చెవిటి, దృష్టిలోపం ఉన్న వారు ఎవరైనా ఉంటే ఈనెల 16న హాజరు కావాలని సూచించారు.