ఎస్పీఎఫ్ చేతికి మెట్రో రైలు భద్రత
హైదరాబాద్: భాగ్యనగరంలో మెట్రో రైలు త్వరలో పరుగులు తీయనుంది. మెట్రో రైలు భద్రతపై నిర్వహణ బాధ్యతలను ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కు అధికార యంత్రాంగం గురువారం అప్పగించింది. దాదాపు 600మంది భద్రత సిబ్బంది నియామకానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి నేడో రేపో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
కాగా, ఉగాది నాటికి నాగోల్- మెట్టుగూడ మధ్య మెట్రోరైలు సేవలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. మెట్రో స్టేషన్లు, పార్కింగ్, సర్క్యులేషన్ ఏరియా, వయడక్ట్, ట్రాక్, రైళ్లు, డిపోలు, కీలక వ్యవస్థలు, యంత్రాంగం, ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ తదితర ప్రాంతాలకు ఎస్పీఎఫ్ భద్రత కల్పించనుంది.